AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే.. అదృష్టం మీ వెంటే..డబ్బు కష్టాలు తీరినట్టే..!

ఇంట్లో తులసిని నాటడం, పూజించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీ దేవి తులసి మొక్కలో నివసిస్తుందని, ఇది సంపద, శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు. తులసితో పాటు మరికొన్ని శుభప్రదమైన మొక్కలను కూడా ఇంట్లో పెంచడం వల్ల మీ అదృష్టానికి ద్వారాలు తెరుచుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి మొక్కల గురించి ఇక్కడ చూద్దాం...

తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే.. అదృష్టం మీ వెంటే..డబ్బు కష్టాలు తీరినట్టే..!
Tulasi
Jyothi Gadda
|

Updated on: Jan 15, 2026 | 4:00 PM

Share

హిందూ మతంలో తులసిని శుభప్రదమైన, దైవిక మొక్కగా పరిగణిస్తారు. తులసిని పూజించే ఇల్లు సంపదతో దీవించబడుతుందని, పేదరికం లేకుండా పోతుందని చెబుతారు. ఇంట్లో తులసిని నాటడం, పూజించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీ దేవి తులసి మొక్కలో నివసిస్తుందని, ఇది సంపద, శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు. తులసితో పాటు మరికొన్ని శుభప్రదమైన మొక్కలను కూడా ఇంట్లో పెంచడం వల్ల మీ అదృష్టానికి ద్వారాలు తెరుచుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి మొక్కల గురించి ఇక్కడ చూద్దాం…

సనాతన ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసిని పూజించే ఇల్లు సంపదతో దీవించబడుతుందని, పేదరికం, బాధలు దరి చేరవని చెబుతారు. లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుంది. ఆ మహా విష్ణువుకు ఇష్టమైనది. తులసితో పాటు అనేక ప్రయోజనాలను అందించే మరికొన్ని మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు ఇంటికి ఆనందం, శ్రేయస్సు, పురోగతిని తెస్తాయి. తులసితో పాటు నాటడానికి శుభప్రదమైన మొక్కలు ఏవో ఇక్కడ చూద్దాం…

అరటి మొక్క:

ఇవి కూడా చదవండి

జ్యోతిష్యం ప్రకారం, గురువారం ఇంట్లో అరటి మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. మత విశ్వాసం ప్రకారం, విష్ణువు అరటి మొక్కలో నివసిస్తాడని నమ్ముతారు. ప్రతి గురువారం ఈ మొక్కను పూజించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కతో పాటు అరటి మొక్కను పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇది ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. అరటిమొక్కను ఎప్పుడూ ఉత్తరం, తూర్పు దిక్కుల్లో నాటడం ఉత్తమం అని వాస్తు నిపుణులు చెబుతారు. కానీ ఇంటి వెనుకల పెరట్లో ఉంటే మంచిదట. వాస్తు ప్రకారం ఇంట్లో సరైన దిశలో అరటి చెట్టు ఉంటే సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని.. ఆ ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరించి ఆనందంగా ఉంటారని నమ్మకం.

శమీ చెట్టు:

జ్యోతిష్యం ప్రకారం, తులసితో పాటు శమీ చెట్టును నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లో శమీ మొక్కను నాటితే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. తులసి మాదిరి శమీ మొక్కను పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల శనిగ్రహ పరిస్థితి శాంతిస్తుందని, అందుకే శనివారం శమీ మొక్క దగ్గర తప్పనిసరిగా నెయ్యి దీపం వెలిగించాలని నిపుణులు చెబుతున్నారు.. శని మొక్క శని వాస్తవ రూపంగా పరిగణించబడుతుంది. ఏ ఇంట్లోనైనా కలహాలు, గొడవలు, అశాంతి వాతావరణం ఉంటే శమీ మొక్కను తప్పనిసరిగా పూజించాలి.

నల్ల ధాతుర మొక్క:

మత విశ్వాసాల ప్రకారం, తులసి, శమీ మొక్క, అరటి చెట్టులో ఉన్నట్టే శివుడు సహా దేవతలంతా ఈ నల్ల దాతురా మొక్కలో కూడా కొలువుదీరి ఉంటారని భక్తుల నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల ధాతురా మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, డబ్బు రాక ఉంటుంది. ఈ మొక్కను ఆదివారం లేదా మంగళవారం నాటడం ఎంతో ఉత్తమం. ఈ మొక్క ఉండటం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోతుందని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?
ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?
తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే,డబ్బు కష్టాలు తీరినట్టే
తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే,డబ్బు కష్టాలు తీరినట్టే
మహేష్ బాబు లుక్స్ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయాలు చెప్పిన మంజుల ఘట్
మహేష్ బాబు లుక్స్ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయాలు చెప్పిన మంజుల ఘట్
ఒకరు కాదు ఇద్దరు..ది రాజాసాబ్‌ను ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
ఒకరు కాదు ఇద్దరు..ది రాజాసాబ్‌ను ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో
నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో
వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్‌ గడ్డం ప్రసాద్
వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్‌ గడ్డం ప్రసాద్
ముగ్గులు బియ్యం పిండితో ఎందుకు వేస్తారు? సంప్రదాయమే కాదు మరో కోణం
ముగ్గులు బియ్యం పిండితో ఎందుకు వేస్తారు? సంప్రదాయమే కాదు మరో కోణం
జనవరి 16న బ్యాంకులకు సెలవు ఉంటుందా..?
జనవరి 16న బ్యాంకులకు సెలవు ఉంటుందా..?
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్‌ ఎక్కండి!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్‌ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది