AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య.. ఇప్పుడు భర్త.. గుండెల్ని పిండేసే ఘటన..

ఒకప్పుడు ఆ ఇల్లు పిల్లల నవ్వులతో కళకళలాడేది. కానీ కాలం పగబట్టింది. సిలిండర్ పేలుడు రూపంలో వచ్చిన మృత్యువు, ఆ ఇంటి ఆనందాన్ని బూడిద చేసింది. గ్యాస్ మంటలు ఆ కుటుంబం ఆశలను, ఆయుష్షును కూడా చిదిమేశాయి. కన్నబిడ్డలు కాలగర్భంలో కలిశారు.. తోడుండాల్సిన భార్య తనువు చాలించింది. ఆఖరికి నా అనుకునే వారు లేని లోకంలో ఉండలేక.. ఆ వ్యక్తి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

Telangana: ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య.. ఇప్పుడు భర్త.. గుండెల్ని పిండేసే ఘటన..
Khammam Family Tragedy
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 17, 2026 | 8:15 PM

Share

విధి పగ పట్టిందో.. లేక ఆ కుటుంబంపై కాలం కనికరం చూపలేదో తెలియదు కానీ ఒక పచ్చని సంసారం చిన్నాభిన్నమైపోయింది. గ్యాస్ ప్రమాదం రూపంలో మొదలైన మృత్యుఘోష, ఆ ఇంటి దీపాన్ని పూర్తిగా ఆర్పేసింది. కళ్లముందే కన్నబిడ్డలు, తల్లిని కోల్పోయిన ఆ తండ్రి.. భార్య కూడా దూరమవడంతో మనోవేదన తట్టుకోలేక తనువు చాలించాడు. తల్లాడ మండలం పాత మిట్టపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద గాథ స్థానికుల కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.

ఆ ఒక్క ప్రమాదం.. అన్నీ దూరం చేసింది!

గతేడాది ఏప్రిల్ 29న గుత్తికొండ వినోద్ ఇంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు వారి జీవితాలను అతలాకుతలం చేసింది. ఆ ప్రమాదంలో వినోద్ తల్లి సుశీల, తన ఇద్దరు ప్రాణ సమానమైన బిడ్డలు తరుణ్, వరుణ్‌లతో పాటు మేనకోడలు కూడా మృత్యువాత పడ్డారు. కళ్లముందే రక్తసంబంధీకులు కాలిబూడిదవ్వడం ఆ దంపతులకు తీరని వేదన మిగిల్చింది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన పిల్లలు లేరనే బాధ వినోద్ భార్య రేవతిని కుంగదీసింది. ఆ మనోవేదనతో గతేడాది డిసెంబర్ 22న ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చేతికి అందొచ్చిన పిల్లలు, తోడుండాల్సిన భార్య.. ఇలా అందరూ మృత్యుఒడికి చేరడంతో వినోద్ అనాథగా మిగిలిపోయాడు.

నా అనుకున్న వారందరూ వెళ్లిపోయారు.. ఇక నేనెందుకు?” అనే శూన్యం అతడిని వెంటాడింది.కుటుంబంలో ఎవరూ లేరన్న తీవ్ర మనస్థాపంతో ఈనెల 7న వినోద్ తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మృత్యువుతో పోరాడి వినోద్ కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం కాల గర్భంలో కలిసిపోయింది. ఒకప్పుడు పిల్లల అల్లరితో, నవ్వులతో కళకళలాడిన ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. విధి ఆడిన ఈ వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన అందరూ మరణించడంతో పాత మిట్టపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..