AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

లక్కీ డ్రా పేరుతో రీల్స్ స్టార్స్.. జనాలను మభ్యపెడితే.. ఖబర్దార్.. అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. సెలబ్రిటీలను సైతం వదిలేది లేదని స్పష్టం చేశారు. మరి ఆ వివరాలు ఏంటి.? ఓ సారి ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Hyderabad: రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
Vc Sajjanar
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jan 17, 2026 | 5:55 PM

Share

సోషల్‌ మీడియా క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని.. ‘లక్కీ డ్రాల’ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా ఆయన స్పందించారు. గతంలో బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేసిన కొందరు, ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పడటంతో ఇప్పుడు ‘లక్కీ డ్రాల’ అవతారమెత్తారని సీపీ ధ్వజమెత్తారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

ఇవి కూడా చదవండి

కార్లు, ఖరీదైన బైకులు, ఇళ్లు, డీజే సెట్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రజలకు ఎర వేసి, నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రీల్స్‌లో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ, వాస్తవంలో మోసాలకు పాల్పడుతున్న పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలను సజ్జనార్ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై ‘ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ – 1978’ కింద కేసులు నమోదు చేస్తామని సజ్జనార్‌ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో వారు సినిమా సెలబ్రిటీలైనా, సోషల్‌ మీడియా స్టార్లైనా సరే.. చట్టపరమైన చర్యల నుంచి ఎవరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు.

లక్కీ డ్రాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను సీపీ కోరారు. ఇందుకోసం డయల్ 100కు గానీ, హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490616555కు గానీ వివరాలు పంపించాలని సూచించారు. లేదా స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రలోభాలకు గురిచేసే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..