Chicken Prices: ఒక్కో కోడి ధర రూ.8 వేలు.. కొనేందుకు జనం బారులు.. ఎందుకంటే..?
సంక్రాంతి సందర్భంగా ఏపీలో ఇంకా పలుచోట్ల కోడి పందేలు జరుగుతూనే ఉన్నాయి. ఇక పలు జిల్లాల్లో పండుగ శోభ సంతరించుకునే ఉంది. అయితే పందెంలో ఓడిపోయిన కోళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇవి భారీ ధరకు విక్రయిస్తున్నారు. ఒక్కో కోడి ఎంత పలుకుతుందో తెలుసా..?

సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రా.. ఆంధ్రా అంటేనే సంక్రాంతి పండుగ అనేది అందరికీ తెలిసిందే. ఏపీలో సంక్రాంతి పండగ అంతలా పాపులర్ అయింది. అత్యంత గ్రాండ్‌గా ఏపీలో సంక్రాంతి సంబురాలు ఊరువాడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడో నివసించేవారు ఈ పండక్కి తప్పనిసరిగా తమ సొంతూళ్లకి చేరుకుంటారు. ఇక పిల్లలు పంతుగులు ఎగురువేయడం, మహిళలు రకరకరాల రంగవల్లులతో అలంకరణలు, కొత్త అల్లుళ్లతో సందడి అటు ఉంచితే.. సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది కోడి పందేలే.. ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కోడి పందేలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఏపీలో పండక్కి కోడి పందేలు జోరుగా సాగాయి. రూ.కోట్లల్లో చేతులు మారాయి.
ధర ఎంతంటే..?
అయితే పందెంలో ఓడిపోయిన కోడిని ఏం చేస్తారనే అనుమానం చాలామందికి ఉంటుంది. పందెంలో ఓడిపోయిన కోడి పుంజును గెలిచిన విజేతకు దక్కుతుంది. దీంతో గెలిచినవారు ఓడిపోయిన కోడిపుంజును విక్రయించడం లేదా బంధువులు, స్నేహితులకు పంచడం లాంటివి చేస్తూ ఉంటారు. పందెం కోళ్లకు బాదం, పిస్తా లాంటివి వేసి పెంచుతారు. దీంతో వాటి మాంసం మరింత రుచికరంగా ఉంటుంది. దీని వల్ల ఓడిపోయిన కోడి మాంసానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం పందెంలో ఓడిపోయిన కోళ్లు రూ.6 వేల నుంచి రూ.8 వరకు పలుకుతున్నాయి. ఇక వీటి కేజీ చికెన్ రూ.2 వేల వరకు ఉంటుంది. ధర ఎక్కువగా ఉన్నా రుచి కోసం వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.
కొత్త అల్లుళ్ల కోసం..
ఓడిపోయిన కోళ్లను బరుల వద్దే విక్రయిస్తున్నారు. దీంతో ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. పందెం కోళ్లకు బాదం, పిస్తాతో పాటు చికెన్, గుడ్లు, మటన్ కీమా వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం అందించి పెంచుతారు. దీని వల్ల వీటి మాంసం కూడా అత్యంత రుచికరంగా ఉంటుంది. దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడున్నారు. ఇక సంక్రాంతికి ఇంటికొచ్చే కొత్త అల్లుళ్లకు కూడా ఇలాంటి మాంసాన్ని వడ్డిస్తారు.
