మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పందాలు జోరుగా సాగాయి. కోడిపందాలతో పాటు గుండాటలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజోలులో ఫ్లడ్‌లైట్ల కింద కోడిపందాలు జరుగుతుండగా, గుండాటలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. మహిళలు లాభాలు ఆర్జించి పురుషులకు దీటుగా నిలిచారు.
కోనసీమ జిల్లా రాజోలులో సంక్రాంతి పందాలు జోరుగా కొనసాగాయి. కోడిపందాలు, గుండాటలు యథేచ్ఛగా జరిగాయి. రాత్రివేళల్లో ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేసి మరీ కోడిపందాలు నిర్వహించారు. ఈ పందాలలో మహిళలు కూడా మగవారికి దీటుగా పాల్గొన్నారు. ముఖ్యంగా గుండాటలో మహిళలు కాయ రాజా కాయ అంటూ ఉత్సాహంగా ఆడి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సంక్రాంతికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. కోడిపందాలతో పాటు రికార్డింగ్ డాన్సులు కూడా విరివిగా జరిగాయి. రాజోలు నియోజకవర్గంలోని వేగివారిపాలెం, అమలాపురం, రావులపాలెం, కొత్తపేటతో సహా పలు ప్రాంతాలలో ఈ పందాలు కొనసాగాయి. యువతతో పాటు మహిళలు గుండాటల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపారు.
మరిన్ని వీడియోల కోసం :
బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!

