బలగం వేణు నుండి వస్తున్న ఎల్లమ్మ చిత్రంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నారు. రా అండ్ రస్టిక్ లుక్‌లో పర్షి పాత్రలో ఆయన గ్లిమ్స్‌లో అదరగొట్టారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో, పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే నటులుగా మారిన ఇతర సంగీత దర్శకుల సరసన దేవిశ్రీ ప్రసాద్ చేరనున్నారు.