జమ్మూకాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది, జనజీవనం ప్రభావితమైంది. చిల్లై కలాన్ సీజన్ కావడంతో రాష్ట్రానికి భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ద్రాస్, జోజిలా పాస్, సోన్ మర్గ్ ప్రాంతాల్లో రోడ్లపై పేరుకుపోయిన మంచును అధికారులు భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు.