AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏంటంటే..?

Pomegranate Side Effects: దానిమ్మ గింజలను కొరికినప్పుడు వచ్చే ఆ తీపి వగరు రుచి ప్రకృతి ప్రసాదించిన మిఠాయిలా అనిపిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ పండు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే ప్రతి ఒక్కరికీ దానిమ్మ మేలు చేయదు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దానిమ్మను తింటే అది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. యూరోపియన్ PMC, రీసెర్చ్ గేట్ వంటి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనాల ప్రకారం.. దానిమ్మ పండును నివారించాల్సిన ఆ ఐదు రకాల వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: Jan 17, 2026 | 6:08 PM

Share
తక్కువ రక్తపోటు: దానిమ్మలో ఉండే పొటాషియం రక్త నాళాలను సడలించి రక్తపోటును తగ్గిస్తుంది. ఇది హైబీపీ ఉన్నవారికి వరం, కానీ ఇప్పటికే లో-బీపీ ఉన్నవారికి శాపం. రోజుకు 300 ml దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. లో బీపీ ఉన్నవారు దీనిని తీసుకుంటే మైకము, కళ్లు తిరగడం, అస్పష్టమైన దృష్టి, స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉంది.

1 / 6
దీర్ఘకాలిక మందులు: మీరు రెగ్యులర్‌గా మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. దానిమ్మలోని సమ్మేళనాలు కాలేయం మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా స్టాటిన్స్, ACE ఇన్హిబిటర్లు యాంటీకోగ్యులెంట్స్ వంటి మందులు వాడుతున్నప్పుడు దానిమ్మ తింటే, మందుల ప్రభావం శరీరంలో ఎక్కువ కాలం ఉండిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

2 / 6
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో దానిమ్మ చాలా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలిఫెనాల్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, ఆరోగ్యకరమైన రక్తనాళాలను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది.

3 / 6
జీర్ణ సమస్యలు: దానిమ్మలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది జీర్ణక్రియకు మంచిదే కానీ సున్నితమైన కడుపు ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. దానిమ్మలోని టానిన్లు పేగు పొరను చికాకు పెట్టి.. కడుపు ఉబ్బరం, తిమ్మిరి లేదా విరేచనాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

4 / 6
అలెర్జీ :కొంతమందికి దానిమ్మ తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద, ముఖం లేదా గొంతు వాపు రావచ్చు. పీచు లేదా యాపిల్ వంటి పండ్లకు అలెర్జీ ఉన్నవారికి దానిమ్మతో క్రాస్ రియాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

5 / 6
దానిమ్మ పండు అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని ఆహారంలో చేర్చుకోవాలి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ, పరిమితంగా తీసుకుంటేనే పసిడి లాంటి ఆరోగ్యం మీ సొంతం.

6 / 6
Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన

సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే