Long Drive: లాంగ్ డ్రైవ్‌లో నిద్ర వస్తుందా? రూ. 99 కడితే చాలు.. హైవేలో పక్కనే ఆపేసి ఇలా ఒక కునుకు తీయండి!
Long Drive: లాంగ్ డ్రైవ్ చేస్తున్న వాళ్లకి మధ్యలో పవర్ ర్యాప్ తీసుకోవడం అనేది ఒక పెద్ద సమస్య. హైవేలో అక్కడక్కడ వచ్చే హోటల్స్ లో రూమ్స్ తీసుకోవాలంటే చాలా ఖరీదు. లేదా కారులోనే కాసేపు పడుకుందామంటే కాళ్లు చాపుకోలేము. అదే..

Long Drive: లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి మధ్యలో కులికిపాట్లు కామన్ ప్రాబ్లం. ఇవి చాలా డేంజర్ కూడా. నిద్ర సమస్య వల్ల సగం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం ఐదు నుంచి ఆరు గంటలు డ్రైవ్ చేస్తున్నప్పుడు కనీసం అరగంట అయిన గ్యాప్ ఇవ్వాలని నిపుణులు కూడా చెబుతుంటారు. అవసరమైతే ఓ అరగంట పవర్ మ్యాప్ తీసుకోవడం వల్ల ప్రమాదాల్ని 99 శాతం తగ్గించవచ్చు.
అయితే లాంగ్ డ్రైవ్ చేస్తున్న వాళ్లకి మధ్యలో పవర్ ర్యాప్ తీసుకోవడం అనేది ఒక పెద్ద సమస్య. హైవేలో అక్కడక్కడ వచ్చే హోటల్స్ లో రూమ్స్ తీసుకోవాలంటే చాలా ఖరీదు. లేదా కారులోనే కాసేపు పడుకుందామంటే కాళ్లు చాపుకోలేము. అదే సీట్లో ఇరుక్క సర్దుకుని పడుకోవాల్సి వస్తుంది. దీంతో బాడీపెయిన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Success Story: చదివింది 8.. చిన్న కిరాణా షాపుతో ప్రారంభించి నేడు రూ.8000 కోట్లకు.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో నివాసం!
వీటన్నిటికీ ఒక చిన్న ఐడియా తో చెక్ పెట్టారు పవర్ నాప్ డాట్ కామ్ అనే కంపెనీ. హైవేలో చిన్న చిన్న కంటైనర్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఏసీ, మంచి బెడ్స్, కప్పుకోవడానికి దుప్పట్లు అన్నీ ఉంటాయి. getpowernap.com అనే వెబ్‌సైట్‌లో మీరు ఏ హైవే లో వెళ్తున్నారో ఎంటర్ చేస్తే దగ్గరలో ఉన్న పవర్ నాప్ కంటైనర్ మీకు చూపిస్తుంది. గంటసేపు మీరు ఈ కంటైనర్‌లో పడుకోవాలంటే కేవలం 99 రూపాయలు కడితే చాలు. ఆన్ లైన్ లో పేమెంట్ చేసిన వెంటనే మీకు పాస్ కోడ్ వస్తుంది. అది కంటైనర్ కున్న నెంబర్ లాకింగ్ లో ఎంటర్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. గంటపాటు మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు.
ఒక్క కంటైనర్‌లో ఆరుగురు నిద్రపోయే అవకాశం ఉంటుంది. మొత్తం కంటైనర్ గంట పాటు బుక్ చేసుకోవాలనుకుంటే కేవలం 399 చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే విజయవాడ, వైజాగ్, చెన్నై ఇలాంటి లాంగెస్ట్ హైవేలో ఈ కంటైనర్లను ఏర్పాటు చేశారు. త్వరలో దేశవ్యాప్తంగా ఇలాంటివి ఏర్పాటు చేయనుంది కంపెనీ.
ఇది కూడా చదవండి: Indian Railways: బిగ్ అప్‌డేట్.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు.. రైల్వే కీలక నిర్ణయం
ఇది కూడా చదవండి: Best Mileage Bikes: దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే.. మార్కెట్లో ఫుల్ డిమాండ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







