Mothevari Love Story: ఓటీటీలో దూసుకుపోతున్న పల్లెటూరి ప్రేమకథ.. 3 రోజుల్లోనే బీభత్సం..
తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5. ఆగస్ట్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతున్ేన ఈ సిరీస్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇందులో అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించగా.. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించారు.

గ్రామీణ కథలు, మూలాల్లోంచి ఎమోషన్స్ తీసుకుని జీ5 సరి కొత్త సిరీస్‌లను అందిస్తోంది. తాజాగా జీ5 గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతేవారి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఇందులో అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 8న ప్రీమియర్ అయిన ఈ సిరీస్ సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే 2,00,000 మందికి పైగా వీక్షకులను ఆకర్షించింది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతేవారి లవ్ స్టోరీ’ని నిర్మించారు.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘మోతేవారి లవ్ స్టోరీ’ ఆరెపల్లి గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊర్లోని పర్షి (అనిల్ గీలా) అనే యువకుడి చుట్టూ కథ నడుస్తుంది. అతను సత్తయ్య (మురళీధర్ గౌడ్) కుమార్తె అనిత (వర్షిణి)తో ప్రేమలో పడతాడు. కానీ సత్తయ్య, అతని సోదరుడు నర్సింగ్ (సదన్న) తమ దివంగత తండ్రి రాసిన ఓ వీలునామాను బయటపడటం, దీంతో ఓ భూ వివాదం చెలరేగడం.. ఇక దీంతో హాస్యం, భావోద్వేగాలు పుట్టుకు రావడం, చివరకు ఊహించని మలుపులకు దారి తీయడం జరుగుతుంది. విడుదలైనప్పటి నుండి ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా జీ5 లోని ట్రెండింగ్ చార్టులలో ఈ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. కొద్ది కాలంలోనే ‘మోతేవారి లవ్ స్టోరీ’ తెలుగు రాష్ట్రాలలోని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
‘మోతేవారి లవ్ స్టోరీ’ సిరీస్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంగళవారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిల్ గీలా మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్ అందరికీ థాంక్స్. ఈ సిరీస్ చూస్తే మన ఇంట్లో జరిగే కథలానే అనిపిస్తుంది. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన జీ5 టీంకు థాంక్స్. వీలైనంతగా మా సిరీస్‌ను అందరూ సపోర్ట్ చేయండి. మేం ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది. మేం ఇలానే కష్టపడుతూనే ఉంటాం. ఇలానే ఆడియెన్స్ మా అందరినీ సపోర్ట్ చేయండి. మా సిరీస్ గురించి స్టాలిన్ చిత్రంలో చేప్పినట్టుగా ఓ ముగ్గురుకి చెబుతూ వెళ్లండి. ఇండియాలోనే జీ5లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. జీ5ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. మా సిరీస్‌ను చూడండి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..








