AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ఏం సినిమా రా బాబూ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది.. ఒక్క క్లైమాక్స్ సీన్‏తో..

ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. భారీ బడ్జెట్.. భారీ తారాగణంతో తెరకెక్కించిన కొన్ని చిత్రాలు ఓటీటీలో మాత్రం సంచలన విజయం సాధించాయి. ప్రస్తుతం ఒక సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఊహించని రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ? ప్రస్తుతం ఓటీటీలో ఊహించని రెస్పాన్స్ వస్తుంది.

Cinema: ఏం సినిమా రా బాబూ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది.. ఒక్క క్లైమాక్స్ సీన్‏తో..
Ground Zero Ott
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2025 | 4:04 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మూవీస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాదిలో అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. కానీ ఊహించని విధంగా ఓటీటీలో సంచలన విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఓటీటీలో మాత్రం రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఎందుకంటే ఆ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో జనాలు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరెంటో చెప్పలేదు కదూ.. అదే గ్రౌండ్ జీరో. 2025 సంవత్సరంలో విడుదలైన యాక్షన్ డ్రామాకు బాక్సాఫీస్ వద్ద అంతగా రెస్పాన్స్ రాలేదు.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

ఈ చిత్రాన్ని బిఎస్ఎఫ్ అధికారి నరేంద్ర నాథ్ ధర్ దుబే జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రను పోషించగా.. సాయి తమహంకర్, జోయా హుస్సేన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. శ్రీనగర్ నేపథ్యంలో సాగే ఈ కథ ముందుగా ఉగ్రవాదుల కాల్పులు, ఎన్ కౌంటర్ వంటి సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగే భయానక సన్నివేశాలతో సాగుతుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా చివర క్లైమాక్స్‌లోని 20 నిమిషాలలో మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి. కానీ థియేటర్లలో మాత్రం ఈ చిత్రానికి అంతగా స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా దేశంలోని టాప్ 10 జాబితాలో మూడవ స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా బాక్సాఫఈస్ వద్ద రూ.10.35 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రానికి తేజస్ ప్రభా విజయ్ డియోస్కర్ దర్శకత్వం వహించగా.. ఫర్హాన్ అక్తర్ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..