Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anaganaga OTT: ఓటీటీలోకి రానున్న సుమంత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరో సుమంత్. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో ప్రేమకథ చిత్రాలతో అలరించిన ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లతో వరుస డిజాస్టర్స్ అందుకున్నాడు. దీంతో కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Anaganaga OTT: ఓటీటీలోకి రానున్న సుమంత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
Sumanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 10, 2025 | 8:06 AM

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో సుమంత్ ఒకరు. కెరీర్ మొదట్లో అందమైన ప్రేమకథలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1999లో ప్రేమకథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన సుమంత్.. ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే తనదైన నటనతో తెలుగు అడియన్స్ మనసులలో స్థానం సంపాదించుకున్నాడు. ప్రేమకథ, యువకుడు, పెళ్లి సంబంధం, రామా చిలకమ్మ, చిన్నోడు, స్నేహమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే కొన్నాళ్లుగా ఈ హీరో నటించిన చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి తిరిగి యాక్టివ్ అయ్యాడు సుమంత్. హీరోగానే కాకుండా సహాయ నటుడిగా మారి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అనగనగా. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది.

సన్నీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్కూల్ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. నిన్న సుమంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో వ్యాస్ అనే స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తున్నారు సుమంత్. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సైకిల్ పై భార్య, కొడుకుతో కలిసి వెళ్తూ కనిపించాడు సుమంత్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

“చిన్నప్పుడు మనం చాలా కథలు వినేవాళ్లం కదా.. ? అవే కథలు మళ్లీ నెమరు వేయడానికి వస్తున్న మన వ్యాస్ సార్ కు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసింది ఈటీవీ విన్. అయితే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇందులో కాజల్ రాణి కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది కాజల్.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన