రాజమౌళికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్.. ఏంటంటే
దర్శకధీరుడు రాజమౌళికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఓ డిమాండ్ ఎదురవుతోంది. తమ నటుడికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేయాలంటూ

NTR RRR Movie: దర్శకధీరుడు రాజమౌళికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఓ డిమాండ్ ఎదురవుతోంది. తమ నటుడికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు.
అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ని ప్రకటించినప్పటి నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గతేడాదే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లగా.. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోలకు సంబంధించిన అప్‌డేట్ వస్తుందా అని వారు చాలా ఎదురుచూశారు. ఇక మార్చిలో ఉగాది సందర్భంగా పోస్టర్, చెర్రీ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు పేరుతో ఓ స్పెషల్ టీజర్‌ని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ విడుదల చేసింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇదే తరహాలో మేలో ఎన్టీఆర్ స్పెషల్ టీజర్ వస్తుందని అతడి ఫ్యాన్స్ ఆశించారు.
కానీ లాక్‌డౌన్‌తో షూటింగ్‌కి బ్రేక్ పడటంతో, ఎన్టీఆర్ వీడియో షూటింగ్ జరపలేదని రాజమౌళి తెలిపారు. అంతేకాదు షూటింగ్ ప్రారంభం అవుతూనే.. మొదట ఎన్టీఆర్ పార్ట్‌ను షూట్ చేసి వీడియో రిలీజ్ చేస్తామని అన్నారు. అయితే షూటింగ్‌లకు అనుమతి లభించినప్పటికీ, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో త్వరగా షూటింగ్‌ని ప్రారంభించి, ఎన్టీఆర్ వీడియోను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఆర్‌ఆర్‌ఆర్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? ఎన్టీఆర్ వీడియో ఎప్పుడు వస్తుంది..? వంటి ప్రశ్నలపై జక్కన్న ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.
Read More:
అర్జున్ కపూర్‌కి కరోనా పాజిటివ్.. మలైకాకి కూడానా!
వేషం మార్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎలా అరెస్ట్ అయ్యాడంటే!



