బాలయ్య-బోయపాటి సినిమాలో ఆ సీనియ‌ర్ హీరోయిన్ ?

బాల‌య్య‌-బోయ‌పాటి సినిమా అంటే నంద‌మూరి అభిమానుల‌కు పూన‌కాలే. గ‌తంలో ఈ ఇద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 4:21 pm, Sun, 6 September 20
బాలయ్య-బోయపాటి సినిమాలో ఆ సీనియ‌ర్ హీరోయిన్ ?

బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా అంటే నంద‌మూరి అభిమానుల‌కు పూన‌కాలే. గ‌తంలో ఈ ఇద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నాయి. తాజాగా వీరు మ‌చ్చ‌ట‌గా మూడో సినిమా చేస్తూ, హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేశారు. మార్చిలో షూటింగ్ మొద‌లెట్టారు కూడా. అయితే క‌రోనా కార‌ణంగా ఆ తర్వాత చిత్రీక‌ర‌ణ ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ చ‌క్క‌ర్లు కొడుతోంది.

సీనియర్​ నటి మీనా ఈ మూవీలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆ వార్త సారాంశం. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. సెప్టెంబరు రెండో వారం నుంచి షూటింగ్‌కు రెడీ అవుతుంది మూవీ యూనిట్. గతంలో ‘బొబ్బిలి సింహం’, ‘ముద్దుల మొగుడు’తో పాటు పలు చిత్రాల్లో బాలయ్య-మీనా కలిసి న‌టించి ప్రేక్షకాద‌ర‌ణ పొందారు.

Balakrishna Uncomfortable with Meena | Balakrishna and Meena Romantic Scenes

 

Also Read :

క‌రోనా సోకింద‌ని అమ్మ‌ను పొలం వ‌ద్ద వ‌దిలేశారు

జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు