జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు

విద్య‌, వైద్యం విష‌యంలో ప‌లు విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్. తాజాగా గ్రామీణ ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక వైద్యాన్ని మ‌రింత చేరువ చేయ‌డానికి అడుగులు వేస్తున్నారు.

జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు
Follow us

|

Updated on: Sep 06, 2020 | 9:36 AM

విద్య‌, వైద్యం విష‌యంలో ప‌లు విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్. తాజాగా గ్రామీణ ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక వైద్యాన్ని మ‌రింత చేరువ చేయ‌డానికి అడుగులు వేస్తున్నారు. ఏపీలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌ను పెంచి, ప‌ల్లె ప్ర‌జ‌లకు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఈ క్ర‌మంలో మండ‌లానికి రెండు ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌తిపాద‌న‌లు రెడీ చేస్తోంది. వైద్యం కోసం ప్ర‌జ‌లు ఎక్కువ దూరం ప్ర‌యాణించే ఇబ్బంది ఉండ‌కూద‌ని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో 671 మండలాలు ఉండ‌గా, ప్రస్తుతం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో మండలంలో ఇప్పటికే రెండు పీహెచ్‌సీలున్నా అవసరాన్ని బట్టి మరింతగా పెంచేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు త‌ప్ప‌నిస‌రిగా సేవ‌లందించాని ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఒకరు, 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ ప‌ర్యవేక్షిస్తారు. రాత్రి 8 గంటల తర్వాత ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసుల్లో భాగంగా ఫోన్‌ చేస్తే పీహెచ్‌సీకి వచ్చి వైద్యం అందించాలి. ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు.

Also Read :

సీఎం‌ జగన్ పెద్దమామ‌ కన్నుమూత

శిరోముండనం కేసులో నూతన్​ నాయుడుకు రిమాండ్

Latest Articles