- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's Harihara veeramallu teaser release update on May 01 Telugu Heroes Photos
Hari Hara Veera Mallu: గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
ఇక్కడ లేకున్నా ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు పవర్‌స్టార్. ఓ వైపు ఏపీ ఎన్నికల బరిలో బిజీ బిజీగా తిరుగుతున్నా, పవన్ సినిమాల అప్‌డేట్లు మాత్రం ఇండస్ట్రీలో ఆయన కనిపించని లోటును తీరుస్తున్నాయి. ఇప్పుడు నా వంతు అంటూ బరిలోకి దిగుతోంది హరిహరవీరమల్లు. ఈ సినిమా ఈ సీజన్‌నే ఎందుకు టార్గెట్ చేసినట్టు.? ధర్మం కోసం యుద్ధం అంటూ టీజర్‌ని విడుదల చేస్తున్నారు హరిహరవీరమల్లు మేకర్స్.
Updated on: May 01, 2024 | 9:39 PM

ఇక్కడ లేకున్నా ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు పవర్‌స్టార్. ఓ వైపు ఏపీ ఎన్నికల బరిలో బిజీ బిజీగా తిరుగుతున్నా, పవన్ సినిమాల అప్‌డేట్లు మాత్రం ఇండస్ట్రీలో ఆయన కనిపించని లోటును తీరుస్తున్నాయి. ఇప్పుడు నా వంతు అంటూ బరిలోకి దిగుతోంది హరిహరవీరమల్లు. ఈ సినిమా ఈ సీజన్‌నే ఎందుకు టార్గెట్ చేసినట్టు?

కానీ పవన్ లేటెస్ట్ ఎనౌన్స్‌మెంట్‌తో ఆ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అసలు సెప్టెంబర్‌లోపు పవన్ సెట్‌కి రానని చెప్పటంతో ఓజీ ఇప్పట్లో లేనట్టే అని డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్.

అప్పుడే కోవిడ్ రావడం, ఆ తర్వాత కొన్నాళ్లకు.. వేసిన సినిమా సెట్లు పాడు కావడం అంటూ రకరకాల కారణాలతో డిలే అయింది. హరిహరవీరమల్లు షూటింగ్ ఎంత పూర్తయిందన్న దాని మీదా క్లారిటీ లేదు.

అయితే ఉన్నపళాన ఇప్పుడు టీజర్‌ని విడుదల చేయడంలో ఆంతర్యం మీద మాత్రం రకరకాల రీజన్స్ వినిపిస్తున్నాయి. పవన్ ఎలాగూ జనాల మధ్యే ఉన్నారు కాబట్టి, ఆ కరిష్మాతో హరిహరవీరమల్లుకి హైప్ తీసుకురావాలనుకుంటున్నారన్నది ఓ పాయింట్.

పవర్‌ఫుల్ పొలిటికల్ పంచులతో టీజర్‌ని సిద్ధం చేశారని, ఆ డైలాగులు పవన్‌కి పొలిటికల్ గ్రౌండ్‌లో పనికొస్తాయన్నది ఇంకో మాట. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో ఈ మధ్య గ్లాసు గురించి పంచ్‌లు రాశారు హరీష్‌శంకర్. ఈ పంచ్‌ల గురించి పవన్‌కల్యాణ్ రాజకీయ వేదికల మీద కూడా ప్రస్తావించారు.

హరీష్ శంకర్ ఈ డైలాగులను ఎంతో ఇష్టపడి రాశారని చెప్పారు పవన్ కల్యాణ్. ఉస్తాద్ భగత్‌సింగ్ తరహా డైలాగులే ఇప్పుడు హరిహరవీరమల్లులోనూ ఉంటాయా? అనే మాట పదే పదే వినిపిస్తోంది.

దాంతో పాటు ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కల్యాణ్ హాజరయ్యే ఫస్ట్ లొకేషన్ ఏదనే విషయం మీద కూడా ఆరా తీస్తున్నారు జనాలు. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితే హరిహరవీరమల్లు ఈ ఏడాదే విడుదలవుతుందా? లేకుంటే 2025 సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే అనుమానాలు కూడా స్టార్ట్ అయ్యాయి.




