Summer Health: వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త ఈ వ్యాధి లక్షణాలు కావచ్చు..
వేసవి సీజన్‌లో విరేచనాలు సమస్యల తలెత్తితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది శరీరంలో టైఫాయిడ్ సంకేతం కావచ్చు. విరేచనాలు కాకుండా టైఫాయిడ్ వ్యాధి ఇతర లక్షణాల ద్వారా కూడా వెంటనే పసిగట్టవచ్చు. సుదీర్ఘ జ్వరం, తలనొప్పి, అలసట.. వంటి లక్షణాలు కనిపించినా టైఫాయిడ్‌గా అనుమానించవల్సిందే. సాధారణంగా టైఫాయిడ్ త్వరగా నయమవుతుంది. కానీ సకాలంలో చికిత్స చేయకపోతే అది ప్రమాదకరంగా..
వేసవి సీజన్‌లో విరేచనాలు సమస్యల తలెత్తితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది శరీరంలో టైఫాయిడ్ సంకేతం కావచ్చు. విరేచనాలు కాకుండా టైఫాయిడ్ వ్యాధి ఇతర లక్షణాల ద్వారా కూడా వెంటనే పసిగట్టవచ్చు. సుదీర్ఘ జ్వరం, తలనొప్పి, అలసట.. వంటి లక్షణాలు కనిపించినా టైఫాయిడ్‌గా అనుమానించవల్సిందే. సాధారణంగా టైఫాయిడ్ త్వరగా నయమవుతుంది. కానీ సకాలంలో చికిత్స చేయకపోతే అది ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. అసలు టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? ఎలా నిరోధించవచ్చు? వంటి విషయాలు మీ కోసం..
నిజానికి, టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జ్వరం, జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. టైఫాయిడ్ జ్వరం సాధారణంగా కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా సంక్రమిస్తుంది. ఈ వేసవిలో ఆహారం త్వరగా పాడైపోతుంది. ఇటువంటి పాడైపోయిన ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా నోటి ద్వారా పేగులోకి ప్రవేశిస్తుంది. ప్రేగుల నుంచి ఇది రక్తంలోకి ప్రవేశిస్తుంది. టైఫాయిడ్ జ్వరాన్ని కలిగిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టైఫాయిడ్ రోగులు ఏ విధమైన ఆహారం తీసుకోవాలంటే..
టైఫాయిడ్ రోగులకు సాధారణంగా జీర్ణ సమస్యలు ఉంటాయి. కాబట్టి వారు తమ ఆహారంలో తగిన శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో పన్నీర్, పెరుగు, పాలు, పచ్చి కూరగాయలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. టైఫాయిడ్ రోగులు త్వరగా బరువు తగ్గుతారు. కాబట్టి అరటిపండ్లు, బంగాళదుంపలు తప్పక తినాలి. అలాగే శరీరానికి కావలసినంత నీరు తాగాలి. వీలైతే రోజుకు 7-8 గ్లాసుల నీరు తాగేందుకు ప్రయత్నించాలి. తాజా పండ్లతో చేసిన జ్యూస్‌లు తీసుకోవాలి. ఇప్పటికే వివిధ రకాల కడుపు సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.
ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే టైఫాయిడ్‌కు దూరంగా ఉండొచ్చు
చేతుల పరిశుభ్రత పాటించాలి ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి కూరగాయలు, పండ్లు కడగకుండా తినకూడదు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలి శుభ్రమైన నీటితో పాత్రలను కడగాలి
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.