AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Skin Care Tips: వేసవిలో ఎండ వేడిమికి చర్మం నల్లగా కమిలిపోతుందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

మే నెల ప్రారంభమైంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విపరీతమైన వేడి గాలులు, ఎంత తీవ్రత పెరిగిపోయాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ఈ సీజన్‌లో స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు కూడా పెరుగుతుంది. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, చర్మం నల్లబడటం వంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటారు. ఈ సమస్యలన్నింటి నుండి..

Summer Skin Care Tips: వేసవిలో ఎండ వేడిమికి చర్మం నల్లగా కమిలిపోతుందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Summer Skin Care
Srilakshmi C
|

Updated on: May 01, 2024 | 8:38 PM

Share

మే నెల ప్రారంభమైంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విపరీతమైన వేడి గాలులు, ఎంత తీవ్రత పెరిగిపోయాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ఈ సీజన్‌లో స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు కూడా పెరుగుతుంది. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, చర్మం నల్లబడటం వంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటారు. ఈ సమస్యలన్నింటి నుండి రక్షణ పొండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో నిపుణుల మాటల్లో మీకోసం..

చర్మవ్యాధి నిపుణురాలు డా. సౌమ్య ఏం చెబుతున్నారంటే.. వేసవిలో చర్మ కాంతి తగ్గిపోతుంది. సూర్యరశ్మి, దుమ్ము, అలర్జీ వల్ల చర్మ వ్యాధులూ రావచ్చు. కొందరికి శరీరంపై ఎర్రటి దద్దుర్లు సమస్య కూడా పెరుగుతుంది. ఇది ఎక్కువగా వీపు వెనుక, ముఖం, చేతులపై కూడా కనిపిస్తుంది. ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం దెబ్బతిని ఇలాంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సీజన్‌లో సూర్యకాంతి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ముఖాన్ని, శరీరాన్ని కప్పి ఉంచడానికి ప్రయత్నించాలి. బయటికి వెళ్లడానికి 15 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేసుకోవాలి. 30 కంటే ఎక్కువ SPF ఉన్న సన్ స్క్రీన్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించాలి. వీలైతే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోవాలి.

ఇవి కూడా చదవండి

బయటకు వెళ్లడం తప్పనిసరి అయితే పదే పదే నీరు త్రాగుతూ ఉండాలి. అలాగే సీజనల్ పండ్లను తినాలి. వాటర్ కంటెంట్ ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో చర్మంపై ఎలాంటి మచ్చలు కనిపించినా.. అకస్మాత్తుగా వీపుపై దద్దుర్లు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. సకాలంలో చికిత్స చేస్తే చర్మవ్యాధులు తీవ్రతరం కాకుండా నివారించవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.