Hyderabad: లేడీ డాన్ మూడు ముక్కలాట.! 9మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్..

Hyderabad: లేడీ డాన్ మూడు ముక్కలాట.! 9మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్..

Anil kumar poka

|

Updated on: May 01, 2024 | 8:39 PM

హైదరాబాద్ కేంద్రంగా.. బడా వ్యాపారస్తులే లక్ష్యంగా కొనసాగుతున్న గేమింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు. నగరానికి చెందిన మాధవి అనే మహిళ బడా వ్యాపారులకు వల వేసి వారిని గేమింగ్‌లోకి దింపుతోంది. ఈ మేరకు ఖాజాగూడలో ఏకంగా ఓ గేమింగ్ స్థావరాన్నే నడుపుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మూడు ముక్కలాట నిర్వహిస్తూ ఒక్కో ఆటకు రూ.1000 లు వసూలు చేస్తోంది.

హైదరాబాద్ కేంద్రంగా.. బడా వ్యాపారస్తులే లక్ష్యంగా కొనసాగుతున్న గేమింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు. నగరానికి చెందిన మాధవి అనే మహిళ బడా వ్యాపారులకు వల వేసి వారిని గేమింగ్‌లోకి దింపుతోంది. ఈ మేరకు ఖాజాగూడలో ఏకంగా ఓ గేమింగ్ స్థావరాన్నే నడుపుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మూడు ముక్కలాట నిర్వహిస్తూ ఒక్కో ఆటకు రూ.1000 లు వసూలు చేస్తోంది. అంతేకాకుండా విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తూ అందిన కాడికి దండుకుంటోంది ఈ కిలాడీ లేడి.

అయితే, గేమింగ్ పాల్గొని ఇటీవలే కొంతమంది బడాబాబులు ఈ కిలాడీ లేడి మాయలో పడి రూ.లక్షల్లో నష్టపోయారు. దీంతో సమాచారం అందున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఖాజాగూడలోని గేమింగ్ స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ క్రమంలో రూ.62 వేల నగదును సీజ్ చేశారు. 11 మొబైల్‌ ఫోన్లు, ప్లేయింగ్‌ కార్డ్‌ సెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్‌ ఆడుతున్ 9 మందిని అరెస్ట్ చేసి వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.