World’s Tallest Woman: ప్రపంచంలోని అతి పొడవైన మహిళ కన్నుమూత..
ప్రపంచంలోని అతి పొడవైన మహిళ బ్రెజిల్‌కు చెందిన మరియా శాంటోస్ 77 ఏళ్ల వయసులో కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా పేరున్న మరియా అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న మరియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంతో బ్రెజిల్ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రపంచంలోని అతి పొడవైన మహిళ బ్రెజిల్‌కు చెందిన మరియా శాంటోస్ 77 ఏళ్ల వయసులో కన్ను మూశారు. ‘క్వీన్ ఆఫ్ హైట్’గా పేరున్న మరియా అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న మరియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంతో బ్రెజిల్ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిమానులు, రాజకీయ నాయకులు ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు. అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.
యుక్తవయసులో 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తులో ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు. ఆమె బాస్కెట్‌బాల్ క్రీడాకారిణితో పాటు మంచి గాయని కూడా. దేశంలో వేర్వేరు నగరాల్లో జరిగే సర్కస్‌లలో పాల్గొంటూ వీక్షకులను అబ్బురపరిచారు. ఆ తరువాత అంతర్జాతీయంగా కూడా పాపులర్ అయ్యారు. మరియా కుటుంబసభ్యులు 7 అడుగుల హైట్‌తో ఆశ్చర్యపరిచారు. మరియా తండ్రి, ఆంటోనియో సిల్వా ఎత్తు 7 అడుగుల 8.7 అంగుళాలు కాగా ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తల్లి ప్రేమకు నోచుకోని చిట్టి కోతి.. బొమ్మతోనే తన బంధం
ఈ దేశం ప్రజలకు 'దోసకాయలు' మరింత ప్రియం..
ట్యాబ్లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

