అందాలతో మతిపోగొడుతున్న సుహాస్ హీరోయిన్.. 

Phani.ch

01 May 2024

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్‌ని మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది రాశి సింగ్. 

నటనపై ఉన్న ఆసక్తితో చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. 

రాశీ 2019లో జెమ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు. 

ఆతర్వాత  పోస్టర్(2021), ఆది సాయి కుమార్ శశి (2021) చిత్రాలలో నటించి మెప్పించింది రాశి సింగ్. 

ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా రాశి సింగ్ అందానికి, నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

ఆతర్వాత భూతద్దం భాస్కర్‌ నారాయణ సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. దాంతో రాశికి మంచి గుర్తింపు వచ్చింది. 

ఇక ఇప్పుడు సుహాస్ హీరోగా నటిస్తున్న ప్రసన్న వదనం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించనుంది. 

ఈ సినిమా హిట్ అయితే మరిన్ని అవకాశాలు తనను వెతుకుంటూ వస్తాయని భావిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది. ఇటీవలే కొన్ని ఫోటోలు వదిలింది రాశి సింగ్.