బీచ్ లో జలకాలాడుతున్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి

Rajeev 

01 May 2024

కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి గుర్తుందా.? అదే కేజీఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. 

కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసింది. 

అందంతోనూ.. నటనతోనూ ఆకట్టుకుంది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమా తర్వాత ఈ బ్యూటీ బిజీ హీరోయిన్ గా మారుతుందని అంతా అనుకున్నారు. 

కానీ అలా జరగలేదు. కేజీఎఫ్ రెండు పార్ట్స్ తర్వాత శ్రీనిధి పెద్దగా సినిమాలు చేయలేదు. 

కారణం తెలియదు కానీ ఈ అమ్మడికి అంత పెద్ద సినిమా ఆఫర్స్ మాత్రం రాలేదు. కేజీఎఫ్ తర్వాత ఓ సినిమా చేసింది. 

తమిళ్ లో విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా అనే సినిమా చేసింది ఈ చిన్నది. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుందని టాక్. 

రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం వల్లే ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయని టాక్ కూడా ఉంది. 

కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.