అర్జున్‌ కపూర్‌కి కరోనా పాజిటివ్‌‌.. మలైకాకి కూడానా!

బాలీవుడ్‌ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ''నాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని

  • Tv9 Telugu
  • Publish Date - 3:35 pm, Sun, 6 September 20
అర్జున్‌ కపూర్‌కి కరోనా పాజిటివ్‌‌.. మలైకాకి కూడానా!

Arjun Kapoor Corona: బాలీవుడ్‌ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ”నాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని అందరికీ చెప్పడం నా బాధ్యత. నా ఆరోగ్యం బావుంది. ఎలాంటి లక్షణాలు లేవు. డాక్టర్లు, అధికారుల సూచనలతో నేను హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. మీ అందరి మద్దతుకు ముందుగానే నేను థ్యాంక్స్ చెబుతున్నా. నా ఆరోగ్యంపై ప్రతి విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము. మనలోని హ్యుమానిటీ ఈ వైరస్‌పై విజయం సాధిస్తుందని నమ్ముతున్నా” అని అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు.

కాగా ఇటీవలే ఆయన సెట్స్ మీదకు వెళ్లగా.. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ ప్రేయసి, నటి మలైకా అరోరాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ డ్యాన్స్‌ షోలో ఆమె పాల్గొనగా ఆమెకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై ఆమె నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక బాలీవుడ్‌లో ఇప్పటివరకు పలువురికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

Read More:

వేషం మార్చిన మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్‌.. ఎలా అరెస్ట్ అయ్యాడంటే!

మహేష్‌కి విలన్‌గా అనిల్‌కపూర్‌!

https://www.instagram.com/p/CEydxJNp3mB/?utm_source=ig_embed