నితిన్‌ ‘రంగ్‌దే’కు అదిరిపోయే ఆఫర్‌..!

కరోనా పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి డిమాండ్ పెరిగింది. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే పలు చిత్రాలు

నితిన్‌ 'రంగ్‌దే'కు అదిరిపోయే ఆఫర్‌..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 07, 2020 | 11:48 AM

Nithiin Rang De movie: కరోనా పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి డిమాండ్ పెరిగింది. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే పలు చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి. మరికొన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో నితిన్‌ నటిస్తోన్న రంగ్‌దేకు కూడా ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్‌ కాస్ట్‌కి 20శాతం కలిపి ఆ ఓటీటీ ‘రంగ్‌దే’కి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై నితిన్ టీమ్ మాత్రం ఇంకా స్పందించనున్నట్లు టాక్.

కాగా రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటించింది. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీపై బాగా నమ్మకం ఉన్న దర్శకనిర్మాతలు థియేటర్లలోనే రంగ్‌దేను విడుదల చేయాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతికి విడుదల అంటూ ఆ మధ్యన విడుదలైన టీజర్‌లో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఆ ఓటీటీ ఇచ్చిన ఆఫర్‌కి రంగ్‌దే టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Read More:

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దులో ముందడుగు

ఇకపై పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌లు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu