బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌కు వై ప్లస్ కేటగిరి భద్రత
ముంబాయి నగరం తనకు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లా అనిపిస్తోందని కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. తదనంతరం ఆమెకు అనేక రకంగా బెదిరింపులు వస్తున్నాయి.. కొందరైతే చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.. అయితే కంగనాకు ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ నిప్పు కణిక కంగనా రనౌత్‌కు వై ప్లస్ కేటరిగి భద్రత కల్పించారు.. ముంబాయి నగరం తనకు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లా అనిపిస్తోందని కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. తదనంతరం ఆమెకు అనేక రకంగా బెదిరింపులు వస్తున్నాయి.. కొందరైతే చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.. అయితే కంగనాకు ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కంగనాకు కల్పించే భద్రతలో కమాండోలు కూడా ఉండనున్నట్లు హోంశాఖ వర్గాల తెలిపాయి. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా ముంబాయిలో కంగనాకు భద్రత కల్పించాలనే ఆలోచన చేస్తున్నది. కంగనాకు భద్రత కల్పించాలని ఆమె సోదరి, తండ్రి తనను సంప్రదించినట్టు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం థాకూర్ తెలిపారు.
సినీ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగనా రనౌత్ బాలీవుడ్‌లోని చీకటి కోణాలను బయటపెట్టారు.. బంధుప్రీతి రోగంతో బాలీవుడ్ భ్రష్టపట్టిపోయిందన్నారు. డ్రగ్స్‌కు అడ్రస్‌గా మారిందని విమర్శించారు.. సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో ముంబాయి పోలీసుల విచారణను తప్పుపట్టారు.. ముంబాయి పోలీసులను అనేసరికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెరమీదకు వచ్చారు.. కంగనా రనౌత్‌పై విరుచుకుపడ్డారు.. మళ్లీ దీనికి కంగనా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది.. ఇలా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ఇక తనపై విమర్శలు చేస్తున్నవారిపై కంగనా మరోసారి విరుచుకుపడ్డారు. సంజయ్‌రౌత్‌ను పురుష అహంకారిగా అభివర్ణించారు. భారతీయ మహిళలపై ఇన్నేసి ఘోరాలు, ఇన్నేసి అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమేనని కంగనా నిప్పులు చెరిగారు. తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు.