జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో బ్రిడ్జ్ కింద బాంబు ! పసిగట్టి నిర్వీర్యం చేశారు

జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్-కుప్వారా  రోడ్ సమీపంలోని ఆరాం పురాలో ఓ బ్రిడ్జి కింద దాచిన పేలుడు పదార్థాలను పోలీసులు, జవాన్లు కనుగొన్నారు. ఈ వంతెన కింద ఇసుక బస్తాలో దాచిన వీటిని వారు నిర్వీర్యం చేశారు..

జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో బ్రిడ్జ్ కింద బాంబు ! పసిగట్టి నిర్వీర్యం చేశారు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 07, 2020 | 12:25 PM

జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్-కుప్వారా  రోడ్ సమీపంలోని ఆరాం పురాలో ఓ బ్రిడ్జి కింద దాచిన పేలుడు పదార్థాలను పోలీసులు, జవాన్లు కనుగొన్నారు. ఈ వంతెన కింద ఇసుక బస్తాలో దాచిన వీటిని వారు నిర్వీర్యం చేశారు. పుల్వామాను బడ్గామ్ జిల్లాతో కలిపే ఈ  రోడ్డు మార్గం ద్వారానే నిత్యం భద్రతా దళాలు ప్రయాణిస్తుంటాయి. ఉగ్రవాదులే ఈ  బాంబును, ఇతర పేలుడు పదార్థాలను  దాచి ఉంటారని భావిస్తున్నారు. ఇవి పేలిపోయి ఉంటే  భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. ఇటీవల పుల్వామా జిల్లాలోని తూజాన్ గ్రా మంలో కూడా ఓ బ్రిడ్జ్ కింద దాచి ఉంచిన బాంబును సెక్యూరిటీ దళాలు కనుగొని నిర్వీర్యం చేశాయి. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో ఆణువణువూ గాలించే పనిలో జవాన్లు పడ్డారు.