కీర్తి ‘గుడ్‌లక్‌ సఖి’ షూటింగ్‌ పూర్తి

మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న మరో లేడి ఓరియెంటెడ్‌ చిత్రం గుడ్‌లక్ సఖి. జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కీర్తి 'గుడ్‌లక్‌ సఖి' షూటింగ్‌ పూర్తి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 07, 2020 | 9:10 AM

Good Luck Sakhi Shooting: మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న మరో లేడి ఓరియెంటెడ్‌ చిత్రం గుడ్‌లక్ సఖి. జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్‌ పెండింగ్‌లో ఉండగా.. తాజాగా ఆ షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన శ్రావ్య వర్మ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక చిత్రీకరణ పూర్తి అవ్వడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులపై చిత్ర యూనిట్ దృష్టిని సారించనుంది.

కాగా ఈ సినిమాలో కీర్తి బంజారా యువతి పాత్రలో నటించగా.. ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్‌ అందరిని ఆకట్టుకోగా.. ఇకపై ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచనుంది టీమ్. ఇక దిల్‌ రాజు పమర్పణలో సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. మూడు భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి నటించిన మరో మహిళా ఓరియెంటెడ్ చిత్రం కావడం, జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించడం, జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించడం, డీఎస్పీ, చిరంతన్, దిల్ రాజు భాగం అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలకాంశాలు ఇవే

హైదరాబాద్‌లో మొదలైన మెట్రో సర్వీసులు.. వారికి ‘నో’ ఎంట్రీ