బిగ్ బాస్ – 4 కంటెస్టెంట్లు వీరే
బిగబాస్ సీజన్ 4 గ్రాండ్ గా లాంచ్ అయింది. నాగ్ స్టెప్పులతో అదిరిపోయే రేంజ్లో ఓపెన్ అయింది తెలుగు బిగబాస్ నాలుగో సీజన్, వయసు నెంబర్లలో పెరుగుతున్నా.. నాగ్ చరిష్మా ఏ మాత్రం తగ్గడం లేదని మరోసారి చూపించేశారు.
కరోనా ఎఫెక్ట్‌తో వినోదానికి దూరమైన తెలుగు ప్రేక్షకులకు ఆంనందాన్ని పంచేందుకు ప్రారంభమైంది బిగ్ బాస్ 4. ప్రేక్షకులు లేకుండా మొదలైన ఈ సీజన్ లో హోస్ట్‌గా అక్కినేని నాగార్జున తండ్రి పాత్రలో సరికొత్తగా కనిపించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టంట్లు ఎవరనే విషయంపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 4లో వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి.
బిగ్ బాస్ ఇంట్లోని వారి వివరాలు :
1. మోనాల్ గజ్జర్
తొలి కంటెస్టంట్‌గా టాలీవుడ్ నటి మోనాల్ గజ్జర్ మొదటి కంటెస్టంట్‌గా బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ భామ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాలో నటించారు.
2. సూర్యకిరణ్, ప్రముఖ రచయిత, దర్శకుడు
ఆ తర్వాత ప్రముఖ రచయిత, దర్శకుడు సూర్యకిరణ్ రెండో కంటెస్టుగా ఎంట్రీ ఇచ్చారు.
3. లక్ష్మీప్రసన్న లాస్య ప్రియాంక రెడ్డి
మూడో కంటెస్టంట్‌గా లక్షీప్రసన్న లాస్య ప్రియాంక రెడ్డి బిగ్ బాస్ గృహంలోకి ఎంట్రీ ఇచ్చారు.
4. అభిజిత్ నాలుగో కంటెస్టంట్ గా అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాదీ అయిన అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
5.జోర్దార్ సుజాత
ఐదవ కంటెస్టంట్‌గా జోర్దార్ సుజాత బిగ్ బాస్ హౌజ్ లో వచ్చింది.
6.మెహబూబ్ దిల్ సే
ఆరో కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ మెహబూబ్ దిల్ సే ఎంట్రీ ఇచ్చాడు
7. దేవి నాగవల్లి, న్యూస్ రీడర్‌గా, న్యూస్ ప్రజెంటర్.
ఏడో కంటెస్టెంట్‌గా టీవీ 9 దేవి నాగవల్లి బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించింది. రాజమండ్రిలో పుట్టిన దేవి నాగవల్లి న్యూస్ రీడర్ గా, న్యూస్ ప్రజెంటర్ గా అందరికీ సుపరిచితురాలు.
8.దేత్తడి హారిక
తనదైన స్టైల్ డైలాగ్ డెలివరీతో యూట్యూబ్ స్టార్ గా మారిన దేత్తడి హారిక ఎనిమిదో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చింది.
9.సయ్యద్ సోయల్
తొమ్మిదో కంటెస్టంట్ గా టీవీ యాక్టర్ సయ్యద్ సోయల్ రియాన్ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించాడు.
10.అరియానా గ్లోరి పదవ కంటెస్టంట్ గా అరియానా గ్లోరి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జెమినీ టీవీలో ప్రసారమయ్యే కెవ్వు కామెడీ షోలో యాంకర్ గా అందరినీ అలరించింది అరియానా గ్లోరి.
11. అమ్మ రాజశేఖర్
పదకొండో కంటెస్టంట్ గా ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
12. కరాటే కళ్యాణి టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి 12వ కంటెస్ంట్ గా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కళ్యాణి. బ్లాక్ బెల్ట్ సాధించిన కళ్యాణి హరికథలు చెప్పడంలో చాలా ఫేమస్.
13.నోయల్
13వ కంటెస్టెంట్ గా నోయల్ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు. నోయల్ గాయకుడిగా, ర్యాపర్ గా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.
14. దివి 14వ కంటెస్టెంట్ గా దివి బిగ్ బాస్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వెబ్ సిరీస్, సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ కావాలనుకుంటోంది.
15.అఖిల్ సర్తక్ 15వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన అఖిల్ సర్తక్ టాప్ 2 పొజిషన్ లో ఉండాలని బావిస్తున్నాడు.
16.గంగవ్వ బిగ్ బాస్ 4 సీజన్ స్పెషల్ హౌజ్ మేట్ గంగవ్వ పదహారో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.