అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు తీర్మానాలు ఇవే..
సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రారంభంలో ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సంతాప తీర్మానాలు చేయనున్నారు. సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది...
TS Assembly will begin : సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రారంభంలో ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సంతాప తీర్మానాలు చేయనున్నారు. సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ, మండలి అజెండా, పనిదినాలను ఖరారు చేయనున్నారు.
రేపు ప్రశ్నోత్తరాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రద్దు చేశారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు.. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపై కేబినెట్ చర్చించనుంది. మంగళవారం మాజీ ప్రధాని పీవీ శత జయంతి వేడుకల సందర్భంగా చర్చ పెట్టె యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నెల 7 నుంచి జరగనున్న శాసనసభ, మండలి సమావేశాలకు హాజరయ్యే ప్రతి సభ్యుడూ కరోనా పరీక్ష చేయించుకుని రావాల్సిందేనని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే సభ్యులకు సూచించారు. రిపోర్టుల్లో నెగెటివ్ అని తేలితేనే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. శాసనసభ, మండలి సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు, పోలీస్ మార్షల్స్, మంత్రుల వెంట వచ్చే పీఏలు, పీఎ్‌సలు తప్పనిసరిగా టెస్టులు చేయించుకుని ఆరో తేదీకల్లా రిపోర్టులతో సిద్ధంగా ఉండాలని సూచించారు.