అంతర్వేది ఘటనపై స్పందించిన రాష్ట్ర డీజీపీ
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని వెల్లడించారు...
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని వెల్లడించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ఓ బృందం ఘటనాస్థలానికి చేరుకుని తక్షణమే ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు డీజీపీ ఓ ప్రకటన విడుదల చేశారు.
జిల్లా ఎస్పీ, ఏలూరు డీఐజీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారని… విజయవాడ నుంచి ఫొరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలో నిపుణుల బృందం ఘటనాస్థలానికి బయల్దేరిందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయరని డీజీపీ స్పష్టం చేశారు.
అయితే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్దమైన ఘటనై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇందకుగల కారణాలను వెంటే వెల్లడించాలని ఒత్తిడి తెస్తున్నాయి. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్‌కు లేఖ కూడా రాశారు. ఆలయ భక్తులతోపాటు హిందు సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.