Amitabh Bachchan : వామ్మో.. అమితాబ్ బచ్చన్ కట్టిన పన్నులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్.. ఏకంగా అన్ని కోట్లా.. ?
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ స్టార్ స్టేటస్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దేశంలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా నిలిచారు. ఇంతకీ అమితాబ్ ఎన్ని కోట్లు పన్ను చెల్లించారో తెలుసా.. ?

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు. ఈ వయసులో కూడా క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోలను నిర్వహిస్తున్నాడు. అటు సినిమాలను నిర్మిస్తున్నైనారు.. ఇటు వ్యాపారంలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో అమితాబ్ ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమితాబ్ ఎంత పన్ను చెల్లించారనేది ప్రశ్న. నివేదికల ప్రకారం అమితాబ్ ఏకంగా రూ. 120 కోట్ల పన్నులు చెల్లించారట. దీంతో అతను భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే హీరోగా నిలిచాడు. అమితాబ్ బచ్చన్ దశలవారీగా తన పన్నులను చెల్లించారు. చివరి విడతలో ఆయన రూ.52.50 కోట్లు చెల్లించారు. అమితాబ్ దీనిని మార్చి 15న చెల్లించారు.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16 కి హోస్ట్‌గా ఉన్నారు. ఇదే వారి అతిపెద్ద ఆదాయ వనరు. 82 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్‌కు డిమాండ్ కొనసాగుతోంది. అతను ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి హోస్టింగ్ చేస్తే, ఆ షోకి మరింత ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2024-25) అమితాబ్ బచ్చన్ రూ.350 కోట్లు సంపాదించారు. ఇందులో బ్రాండ్ ప్రమోషన్, సినిమా పారితోషికం ఉన్నాయి. గత సంవత్సరం అమితాబ్ బచ్చన్ రూ.72 కోట్ల పన్నులు చెల్లించారు.
భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన నటుడు షారుఖ్ ఖాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. ఆయన రూ. 92 కోట్ల పన్నులు చెల్లించారు. అమితాబ్ బచ్చన్ త్వరలో ‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్‌లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆయన ‘సెక్షన్ 84’ చిత్రంలో కూడా నటించబోతున్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..