AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అనాథాశ్రమంలో పెరిగి టాలీవుడ్‌లోకి.. బోల్డ్ హీరోయిన్‌గా సూపర్ క్రేజ్.. ఎవరో గుర్తు పట్టారా?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలంటే చాలా రిచ్ అని అనుకుంటారు. కోట్లలో ఆదాయం, లగ్జరీ లైఫ్, విలాసవంతమైన భవనాలు, కార్లు.. ఇలా లార్జర్ ద్యాన్ లైఫ్ అనుకుంటారు. కానీ వారి జీవితాల్లోనూ కన్నీళ్లు, కష్టాలు ఉంటాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి వారు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు.

Tollywood: అనాథాశ్రమంలో పెరిగి టాలీవుడ్‌లోకి.. బోల్డ్ హీరోయిన్‌గా సూపర్ క్రేజ్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Mar 18, 2025 | 6:11 PM

Share

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తుందనుకోండి.. కానీ.. ఆ క్రేజ్ లేదు. అందం, ట్యాలెంట్ ఉన్న ఈ అమ్మడు ఒకప్పుడు బాగా సెన్సేషన్ అయ్యింది. కానీ రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు తన సినిమాలతో అరకోటికి పైగా సంపాదించిన ఈ అందాల తార ఇప్పుడు కేవలం టాక్ షోలకే పరిమితమైంది. అప్పట్లో బోల్డ్ పాత్రలతో అలరించిన ఈ అందాల తార ఇప్పుడు బోల్డ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు తేజస్వి మదివాడ. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. సినిమాల్లో ఎప్పుడు అల్లరిగా, చలాకీగా కనిపించే ఈ అందాల తార జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి మందుకు బానిసయ్యాడు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి అనాథాశ్రమంలో పెరిగింది. ఎన్నో ఇబ్బందులు పడి చదువు కొనసాగింది. రెండేళ్లపాటు లంచ్‌ టైంలో పానీపూరి తిని కడుపు నింపుకున్నానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది తేజస్వి.

కాగా జర్నలిజం చదివిన ఈ ముద్దుగుమ్మ నటనపట్ల ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.మహేశ్ బాబు నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఈ భామకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించింది. అయితే తన కెరీర్ లో ఎక్కువగా సెకెండ్ లీడ్ పాత్రలనే పోషించింది తేజస్వి. అందులోనూ చాలా వరకు బోల్డ్ పాత్రలే. అలాగనీ ఈ సొగసరి ఆదాయం తక్కువేమీ కాదు. ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే లక్షల రూపాయలు వచ్చేవని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది తేజస్వి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అంతా తలకిందులైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేవలం టాక్ షోలకే పరిమితమైంది.

తేజస్వి లేటెస్ట్ ఫొటోస్..

2021లో కమిట్ మెంట్ అనే సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ గతేడాది హైడ్ అండ్ సీక్ మూవీలో కనిపించింది. ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. ప్రస్తుతం ఓ టాక్ షోలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వార్తాల్లో నిలుస్తోందీ అందాల తార.

రియాలిటీ షోలో..

View this post on Instagram

A post shared by TLC India (@tlc_india)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే