Michael Jackson : మైఖేల్ జాక్సన్ క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరి.. వాడేసిన సాక్స్ వేలంలో ఎంతకు కొన్నారంటే..
మైఖేల్ జాక్సన్.. ది కింగ్ ఆఫ్ పాప్. ఒకప్పుడు అతడి సాంగ్స్, ఎమోషనల్ మ్యూజిక్ లవర్స్ కు కనెక్ట్ అయ్యేవి. అప్పట్లో ఆయన పాటలకు పిచ్చెక్కి ఊగిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ అతడి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గ్లోబల్ రేంజ్లో ఈ పాప్ సింగర్ పేరు మారుమోగిపోయేది.

మైఖేల్ జాక్సన్.. ఆయన క్రేజ్ గురించి ఈతరానికి అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు అతడి సాంగ్స్ వింటూ పిచ్చెక్కిఊగిపోయేవారు. మైఖేల్ సాంగ్స్, డ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. పాప్ మ్యూజిక్కి కొత్తరంగుపులిమిన సింగర్ కమ్ డ్యాన్సర్. ఒకప్పటి యువతకు మైఖేల్ రోల్ మోడల్. 1958, ఆగస్టు 29న అమెరికాలోని ఇండియానా రాష్ట్రం, గ్యారీ సిటీలో జన్మించిన మైఖల్.. పాప్ రారాజుగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన సంగీత ప్రపంచ దిగ్గజం. తన సింగింగ్ మాయాజాలంతో పాప్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. మైఖేల్ జాక్సన్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన మూన్ వాక్, డ్యాన్స్ మూమెంట్స్. పాటతోపాటు డ్యాన్స్ లోనూ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..
1982లో విడుదలైన “థ్రిల్లర్” ఆల్బమ్ జాక్సన్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది. 1991లో మైఖేల్ జాక్సన్ ‘బ్లాక్ ఆర్ వైట్’ అనే ఆల్బమ్‌ను సృష్టించాడు. ఆ తర్వాత ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ‘జెన్, మ్యూజిక్ ఎనిమీ, ఫర్ అవర్ ది వరల్డ్, ఆఫ్ ది వాల్” ఆల్బమ్స్ తో ఆయన పేరు గ్లోబల్ రేంజ్ లో మారుమోగింది. దాదాపు పాతికేళ్లపాటు పాప్ సామ్రాజ్యానికి రారాజుగా కొనసాగిన మైఖేల్..ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
మైఖేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత అతడి వస్తువులను వేలం వేయగా లక్షల్లో అమ్ముడయ్యాయి. 1997లో ఫ్రాన్స్‌లో జరిగిన ఒక సంగీత కచేరీలో మైఖేల్ జాక్సన్ ఉపయోగించిన సాక్స్ దాదాపు 8 లక్షల రూపాయలకు వేలంలో అమ్ముడయ్యాయి. 1997లో దక్షిణ ఫ్రాన్స్‌లోని నిమ్స్‌లో మైఖేల్ జాక్సన్ కచేరీ జరిగింది. మైఖేల్ జాక్సన్ ఉపయోగించిన సాక్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించాయి. దీంతో ఈవెంట్ నిర్వాహకులు సాక్స్ వేలానికి వేయగా.. ఓ వీరాభిమాని రూ.8 లక్షలకు కొనుగోలు చేశారు. 2009లో మైఖేల్ జాక్సన్ ఉపయోగించిన గ్లోవ్ దాదాపు రూ.3 కోట్లకు వేలం వేయబడింది. అదేవిధంగా, అతను ధరించిన టోపీ 2023లో దాదాపు రూ.7 మిలియన్లకు వేలం వేయబడింది.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..







