డిఫరెంట్‏గా ప్లాన్ చేస్తోన్న గోపీచంద్.. ‘సీటీమార్’‏ను ఆ స్పెషల్ రోజున తీసుకురానున్న హీరో..

హీరో గోపీచంద్‏తో కలిసి మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం 'సీటీమార్'. డిఫ్రరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ

  • Rajitha Chanti
  • Publish Date - 12:39 pm, Mon, 25 January 21
డిఫరెంట్‏గా ప్లాన్ చేస్తోన్న గోపీచంద్.. 'సీటీమార్'‏ను ఆ స్పెషల్ రోజున తీసుకురానున్న హీరో..

హీరో గోపీచంద్‏తో కలిసి మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం ‘సీటీమార్’. డిఫ్రరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక ఇప్పటీకే ఈ మూవీ రీలీజ్ డేట్ గురించి గతంలో అనేక రూమార్స్ వచ్చాయి.

తాజాగా సీటీమార్ సినిమాను ఉగాదికి విడుదల చేయనున్నట్లుగా సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సినిమాను విడుదల చేసేందుకు భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఆంధ్రా టీం ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‏గా గోపీచంద్ నటిస్తుండగా… తెలంగామ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‏గా తమన్నా నటిస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో తమన్నాతోపాటు హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తున్నట్లుగా టాక్. అలాగే సీనియర్ నటి భూమిక కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరీ చూడాలి ఈ సినిమాతో అయిన గోపీచంద్ హిట్ అందుకుంటాడా ? లేదా ? అనేది.

Also Read:

Sarkaru Vaari Paata : మొదలైన మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ షూటింగ్.. ఆనందంలో అభిమానులు