‘స‌ర్కారు వారి పాట’ సరికొత్త రికార్డ్… సోషల్ మీడియాలో హల్‌‌‌‌చల్ చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్

  • Rajeev Rayala
  • Publish Date - 1:22 pm, Mon, 25 January 21
'స‌ర్కారు వారి పాట' సరికొత్త రికార్డ్... సోషల్ మీడియాలో హల్‌‌‌‌చల్ చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్… ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో  వేసుకోనున్నాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ మహేష్ తో ఈ సినిమాలో ఆడిపాడనుంది. 14 రీల్స్ ప్లస్ , మహేశ్ బాబు సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ నేడు( సోమవారం) దుబాయ్ లో ప్రారంభం అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో అలరించనున్నాడు. లాంగ్ హెయిర్, మెడమీద టాటూతో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మార్చేశారు మహేష్ అభిమానులు. ఈ నేపథ్యంలో ‘స‌ర్కారు వారి పాట’  ప్ర‌పంచ వ్యాప్తంగా స‌రికొత్త రికార్డ్ ను సృష్టించింది. “సర్కారు వారి పాట” సినిమా హ్యాష్ ట్యాగ్ ను ఇప్పటికే ట్విట్టర్ ట్రెండ్ చేస్తూ వస్తున్నారు ఫ్యాన్స్ .  దాంతో పాటు మిలియన్స్ ట్వీట్స్ తో అదరగొట్టారు. చాలా రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న ఈ ట్యాగ్.. ఏకంగా వంద మిలియన్లకు పైగా ట్వీట్లను అందుకుంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ ఈ మేరకు ట్విట్టర్ లో పోస్టర్ ను షేర్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Movie Update: విదేశాలకు వెళ్ళనున్న ‘పుష్ప’.. అక్కడే అసలు ట్విస్టు మొదలవుతుందంటా ?