బిగ్ బాస్ టీమ్ ఆమెకు అన్యాయం చేసింది.. ఆవేదన వ్యక్తం చేసిన దువ్వాడ శ్రీనివాస్
బిగ్ బాస్ సీజన్ 9 ఇటీవలే ముగిసింది. ఈ గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. ఇక ఈ సీజన్ లో కామర్స్ తో పాటు సెలబ్రెటీలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 7 సెప్టెంబర్ 2025 లో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా పూర్తయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 9 పూర్తయిపోయింది. ఇన్ని రోజులు ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ గేమ్ షో.. ఇటీవలే విజయవంతంగా సీజన్ 9ను పూర్తి చేసుకుంది. 15 వారలపాటు ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్. సీజన్ 9కు విన్నర్ గా సామాన్యుడు కళ్యాణ్ పడాల నిలిచాడు. సీరియల్ నటి తనూజ రన్నరప్ గా నిలిచింది. ఇక గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈసారి సీజన్ కు మంచి క్రేజ్ తోపాటు రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 5 గా ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డీమన్ పవన్, తనూజ, సంజన టాప్ 5గా నిలిచారు. ఇక బిగ్ బాస్ 9 టాప్ 5 అర్హత లేనివారిని సెలక్ట్ చేశారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.
అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?
దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు మాధురి. హౌస్ లోకి వచ్చిన రెండు వారాల్లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మధురితో పాటు అలేఖ్య చిట్టిపికిల్స్ రమ్య మోక్ష కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమ్మడు అలా వెళ్లి ఇలా వచ్చేసింది. వెళ్లిన మొదటి వారం నామినేషన్స్ లో లేదు.ఆతర్వాతి వారం నామినేషన్స్ లోకి రావడంతో పాటు అదే వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కాగా రమ్య ఎలిమినేషన్ పై తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన
రమ్య మోక్షకు బిగ్ బాస్ టీమ్ అన్యాయం చేసింది. రమ్య మోక్ష కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి. తన కాళ్ల మీద తాను నిలబడిన ధైర్యవంతురాలు రమ్య మోక్ష. అలాగే బిగ్ బాస్ హౌస్ లో అనవసరమైన వారిని అక్కడ ఎక్కువ రోజులు ఉంచారు. రమ్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను తొందరగా పంపించేశారు. ఆ అమ్మాయిని పంపించేయడం బాధాకరమని అన్నారు దువ్వాడ. అంతేకాదు చిన్న చిన్నవాటికి ఆత్మహత్యలకు పాల్పడే యువత రమ్య మోక్ష లాంటి అమ్మాయిని చూసి చాలా నేర్చుకోవాలని, తండ్రి చనిపోయినా ఆ బాధ దిగమింగి ఎలా పోరాడాలో ఆమె నిరూపించిందని చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.








