AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది అసలు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఇక చాలా మందిని మనం మర్చిపోయాం కూడా. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో ఈ అమ్మడు ఒకరు.

అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..
Actress
Rajeev Rayala
|

Updated on: May 27, 2026 | 12:53 PM

Share

అప్పటలో కుర్రాళ్లకు కిర్రెక్కించిన హీరోయిన్ సాక్షి శివానంద్. తెలుగులో ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే జగపతిబాబు, రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోలతోనూ నటించింది సాక్షి శివానంద్. అయితే ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి సినిమా ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యింది.. చడీచప్పుడు లేకుండా రాత్రికి రాత్రే ఇండస్ట్రీ నుంచి గాయబ్ అయ్యింది.  ఇప్పటికీ ఆమె అభిమానులు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. 1977లో ముంబైలో జన్మించిన సాక్షి శివానంద్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషా చిత్రాలలో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె తొలి హిందీ చిత్రం జనమ్ కుండ్లి ఫ్లాప్ అయినప్పటికీ, నటనకు మంచి గుర్తింపు లభించింది. 2003లో ప్రియాన్షు ఛటర్జీతో కలిసి అనుభవ్ సిన్హా దర్శకత్వంలో నటించిన ఆప్కో పెహ్లే భీ కహి దేఖా హై ఆమె కెరీర్‌కు ఒక మలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి : సిల్క్ స్మితా నన్ను కాలితో తన్నింది.. సెట్‌లోనే ఏడ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన నటి

బాలీవుడ్‌లో ఆమెకు ప్రజాదరణ పెరుగుతున్న సమయంలోనే అండర్ వరల్డ్ స్టోరీ తెరపైకి వచ్చింది. సాక్షి బాలీవుడ్ నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఇదే అని అంటుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో సాక్షి మాట్లాడుతూ, తాను పనిచేయబోతున్న సినిమా అండర్  వరల్డ్ కు సంబంధించినదని.. అయితే అదే సమయంలో తీవ్ర భయానికి లోనైనట్లు తెలిపింది. బాలీవుడ్, అండర్వరల్డ్ మధ్య సంబంధం ఉందని తనకు చెప్పారని, దీనితో తాను భయపడి బాలీవుడ్ నుండి బయటపడి సౌత్ ఇండియాకు మారారని తెలిపింది. అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలున్న నిర్మాత నుంచి కాల్స్ రావడంతో సాక్షి తన నంబరు మార్చుకోవలసి వచ్చిందట. ఆ తర్వాత ఆమె సౌత్ సినిమాలలో పనిచేయడం మొదలుపెట్టి, మళ్ళీ బాలీవుడ్ వైపు చూడలేదు.

ఇది కూడా చదవండి:Roja : స్టార్ హీరోల్లో ఆయన నాకు చాలా క్లోజ్.. భలే సరదా మనిషి .. చాలా మంచివారు

సాక్షి శివానంద్ తన సౌత్ ఫిల్మ్ కెరీర్‌ను చిరంజీవి చిత్రం మాస్టర్ తో ప్రారంభించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఇక్కడ కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆమె భర్త పేరు సాగర్. అయితే, గత కొంతకాలంగా ఆమె సౌత్ సినిమాలలో కూడా పెద్దగా కనిపించడం లేదు. 2019లో సాక్షి శివానంద్ వార్తల్లోకి వచ్చారు, అప్పుడు ఆమె సోదరి శిల్పా ఆనంద్ (ఓహన్న శివానంద్), సాక్షి పై ఆమె అత్తగారిపై సంచలన ఆరోపణలు చేసింది. “నా సోదరి సాక్షి, ఆమె అత్త భావనలపై మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భావన తన భర్తను చంపేసింది. ఇప్పుడు బీమా డబ్బుల కోసం నన్ను, నా తల్లిని కూడా చంపాలనుకుంటోంది. దీనికి నా సోదరి సాక్షి శివానంద్ సాయం చేస్తోంది” అంటూ షాకింగ్ ఆరోపణలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి:తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా

Sakshi Shivanand

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..
అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..
జూన్ 1 నుంచి కొత్త రూల్ తీసుకొచ్చిన కేంద్రం
జూన్ 1 నుంచి కొత్త రూల్ తీసుకొచ్చిన కేంద్రం
సేమియా పాయసం చిక్కబడకుండా రుచిగా ఉండాలంటే ఇలా చేయండి..
సేమియా పాయసం చిక్కబడకుండా రుచిగా ఉండాలంటే ఇలా చేయండి..
మావాడే దగ్గరుండి మరీ ఓడించాడు.. నా పవర్ ఏంటో ఫైనల్లో చూపిస్తా
మావాడే దగ్గరుండి మరీ ఓడించాడు.. నా పవర్ ఏంటో ఫైనల్లో చూపిస్తా
అమెరికాలో మరో గుజారాతీ మహిళ దారుణ హత్య.. 5 నెలల్లో 4 మర్డర్లు
అమెరికాలో మరో గుజారాతీ మహిళ దారుణ హత్య.. 5 నెలల్లో 4 మర్డర్లు
కలలో బొద్దింక కనిపించిందా? స్వప్న శాస్త్రం చెప్పే షాకింగ్ సంకేతం
కలలో బొద్దింక కనిపించిందా? స్వప్న శాస్త్రం చెప్పే షాకింగ్ సంకేతం
గురు బలం.. ఇక వారి ఆర్థిక కష్టాలు, రుణ సమస్యలు ఫసక్..!
గురు బలం.. ఇక వారి ఆర్థిక కష్టాలు, రుణ సమస్యలు ఫసక్..!
భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..
భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..
2030 నాటికి చంద్రుడిపైకి మానవులు.. అక్కడే శాశ్వత నివాసం..
2030 నాటికి చంద్రుడిపైకి మానవులు.. అక్కడే శాశ్వత నివాసం..
మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్ల
మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్ల