ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది.. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి
హీరో శ్రీకాంత్ క్రేజ్ గురించి తెలిసిందే. ఒకప్పుడు జగపతి బాబు తర్వాత ఆ స్థాయిలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. విభిన్న కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో సహయ నటుడిగా కనిపిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం సహాయక పాత్రల్లో నటిస్తున్నారు శ్రీకాంత్

హీరో శ్రీకాంత్ క్రేజ్ గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేసి మెప్పించిన శ్రీకాంత్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా లేడీస్ లో శ్రీకాంత్ విపరీతమైన క్రేజ్ ఉండేది. ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ సినిమాలు తగ్గించారు. సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, యువతారల గురించి పలు విషయాలు పంచుకున్నారు. తన ప్రస్తుత కెరీర్ దశను బోనస్ అని అన్నారు శ్రీకాంత్, “అఖండ” సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని పేర్కొన్నారు. గతంలో హీరోగా 25 సంవత్సరాలు పనిచేసినప్పటికీ, ఇప్పుడు ఎలాంటి టెన్షన్లు లేకుండా రిలాక్స్డ్ గా పనిచేస్తున్నానని తెలిపారు. డబ్బు కంటే టెన్షన్లు లేకపోవడమే ముఖ్యమని శ్రీకాంత్ నొక్కి చెప్పారు. శ్రీకాంత్ తన కుమారుడు రోషన్ కెరీర్‌ను ప్రోత్సహిస్తూనే, తాను కూడా మంచి కథలు, వైవిధ్యమైన పాత్రలు వస్తే హీరోగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఇది కూడా చదవండి : సిల్క్ స్మితా నన్ను కాలితో తన్నింది.. సెట్‌లోనే ఏడ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు నటులకు, నిర్మాతలకు అవకాశాలను పెంచాయని అభిప్రాయపడ్డారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని, గతంలోనూ చాలా మంది నూతన దర్శకులతో పనిచేశానని గుర్తు చేసుకున్నారు. లెజెండరీ దర్శకులైన కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పనిచేయలేకపోవడం, అలాగే ఎన్.టి. రామారావు, శోభన్ బాబు వంటి దిగ్గజ నటులతో కలిసి నటించలేకపోవడం తన మనసులో మిగిలిపోయిన విషయాలని శ్రీకాంత్ తెలిపారు. నాగేశ్వర రావు, కృష్ణం రాజు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర నటులతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మధ్య ఉన్న అద్భుతమైన పోలికలను శ్రీకాంత్ వివరించారు. ఇద్దరూ ఆర్టిస్ట్ లను అద్భుతంగా చూసుకుంటారని, సెట్‌లో భోజన సౌకర్యాల దగ్గర నుంచి అందరినీ సొంత మనుషుల్లా చూసుకుంటారని తెలిపారు. రామ్ చరణ్ ను చాలా మెచ్యూర్డ్, తెలివైన వ్యక్తిగా అభివర్ణించిన శ్రీకాంత్, గోవిందుడు అందరివాడే సమయంలో ఎలా ఉన్నారో, ఆర్‌ఆర్‌ఆర్ వంటి అంతర్జాతీయ విజయం తర్వాత కూడా ఎలాంటి గర్వం లేకుండా అంతే సింపుల్‌గా ఉన్నారని ప్రశంసించారు.
ఇది కూడా చదవండి:Roja : స్టార్ హీరోల్లో ఆయన నాకు చాలా క్లోజ్.. భలే సరదా మనిషి .. చాలా మంచివారు
రామ్ చరణ్ తనను “అన్న” అని పిలుస్తారని, వారి మధ్య మంచి బాండింగ్ ఉందని తెలిపారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని కూడా శ్రీకాంత్ పంచుకున్నారు. ఎన్టీఆర్ హీరో కాకముందు నుంచే తమకు పరిచయం ఉందని, శ్రీనగర్ కాలనీలో ఇంటి పక్కనే ఉండేవాడని చెప్పారు. ఎన్టీఆర్ లోని ఎనర్జీ, సరదా, గోల ఇప్పటికీ మారలేదని, ఆయన వ్యక్తిత్వం అలాగే ఉండిపోయిందని తెలిపారు. చిత్రాల పరంగా ఇమేజ్‌లు మారినప్పటికీ, మనుషులుగా వారి వ్యక్తిత్వాలు మారలేదని ఆయన నొక్కి చెప్పారు. ఇంకా మహేష్ బాబు, ప్రభాస్ వంటి ప్రస్తుత తరం స్టార్లతో కలిసి నటించే అవకాశం రాలేదని శ్రీకాంత్ తెలిపారు. అఖండతో తన కెరీర్ లో వచ్చిన ఈ కొత్త అధ్యాయంలో, భవిష్యత్తులో వారితో కూడా కలిసి పని చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలో నిలబడాలనే తన దృక్పథంతో, ఇమేజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వకుండా, తనకు వచ్చిన అవకాశాలతో సంతోషంగా ముందుకు సాగుతున్నానని శ్రీకాంత్ ముగించారు.
ఇది కూడా చదవండి:తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా





