AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క పాత్ర లైఫ్ సెటిల్ చేసింది.. పదేళ్ల పాటు తిరుగులేని క్రేజ్ తెచ్చి పెట్టింది

తెలుగు సినీ చరిత్రలో తనదైన విలక్షణమైన శైలితో, అరుదైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు మాడా వెంకటేశ్వరరావు. స్పెషల్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన సినీరంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. పువ్వుల పున్నయ్య సినిమాలో ఆయన చేసిన పాత్ర లైఫ్ నే సెటిల్ చేసింది.

ఒకే ఒక్క పాత్ర లైఫ్ సెటిల్ చేసింది.. పదేళ్ల పాటు తిరుగులేని క్రేజ్ తెచ్చి పెట్టింది
Mada Venkateswara Rao
Rajeev Rayala
|

Updated on: May 24, 2026 | 1:03 PM

Share

తెలుగు సినీ చరిత్రలో తనదైన విలక్షణ నటనతో, హాస్యంతో ప్రేక్షకులను అలరించిన మాడా వెంకటేశ్వరరావు  గురించి ఏఈ జనరేషన్ వాళ్లకు తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు ఆయన తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా, కడియం దగ్గర దుళ్ళ గ్రామంలో 1950లో జన్మించిన మాడా వెంకటేశ్వరరావు తన ప్రాథమిక విద్యను మండపేటలో పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఆయనకు నాటకాలపై అపారమైన మక్కువ ఉండేది. పాఠశాలలో ముద్దబ్బాయి నాటికలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. నాటకరంగంలో గండికోట జగన్నాథరావు గారి శిష్యుడిగా, స్ఫూర్తితో మాడా గారు కాకినాడలోని సూత్ర కళామందిరం, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ వంటి అనేక వేదికలపై నాటక ప్రదర్శనలు ఇచ్చారు. హాస్యాన్ని పండించడంలో ఆయనకున్న ప్రత్యేక శైలి, ముఖ కవళికలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు. ముఖ్యంగా చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటికలోని పువ్వుల పున్నయ్య పాత్ర మాడా గారికి ఆంధ్రప్రదేశ్ అంతటా అపారమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ పాత్రతో ఆయన ఇంటిపేరు “మాడా” ఒక విలక్షణమైన, హాస్యభరితమైన పదంగా మారిపోయింది. ఓ సినిమా కోసం ఆయన ఆడ, మెగా కానీ పాత్రలో నటించారు. దాంతో ఆయనకు పదేళ్ల పాటు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. పువ్వుల పున్నయ్యలో ఆయన చేసిన తేడా పాత్ర ఆయన లైఫ్ ను సెటిల్ చేసింది. సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు.. పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి : నన్ను కాదని ఆ హీరోయిన్‌ను తీసుకుంటారా.? ఆ సినిమా విషయంలో త్రిష గొడవ

వృత్తిరీత్యా విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా పని చేస్తూ, 1965 ప్రాంతంలో హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఒక నాటక ప్రదర్శనలో మాడా గారి నటనను చూసిన అక్కినేని నాగేశ్వరరావు గారు ముగ్ధులై, తమ తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని మాడా గారికి మాట ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు గారలు కలిసి చక్రవర్తి చిత్ర బ్యానర్‌ను స్థాపించి సుడిగుండాలు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతోనే మాడా వెంకటేశ్వరరావు గారి సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత జై జవాన్, అమాయకురాలు, కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఉండమ్మా బొట్టు పెడతా వంటి అనేక చిత్రాలలో నటించారు. 1972లో తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసుకు మారడంతో, మాడా గారు కూడా మద్రాసుకు వెళ్ళిపోయారు. అక్కడ ఎన్.టి. రామారావు గారు తమ సొంత చిత్రాలైన కులగౌరవం, డ్రైవర్ రాముడు, శ్రీమద్విరాట్ పర్వం (ఉత్తర కుమారుడిగా) వంటి వాటిలో మాడా గారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే ప్రముఖ దర్శకుడు బాపు గారి అందాల రాముడు చిత్రంలోనూ ఆయన నటించారు.

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో చాలా అందగాడు.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. జాన్వీ క్రేజీ కామెంట్స్

మాడా వెంకటేశ్వరరావు గారి సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన చిత్రం బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గు. ఈ చిత్రంలోని “హలో హలో హలో…” అనే డైలాగ్‌తో కూడిన హాస్య సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోల చిత్రాలలోనూ, ఆదుర్తి సుబ్బారావు గారి మాయదారి మల్లిగాడు, లమ్మద రామదాసు వంటి చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన మాడా గారికి 1995 తర్వాత, పరిశ్రమ హైదరాబాద్‌కు మారడం, కొత్త తరం నటుల ప్రవేశంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆయన వేదిక ప్రదర్శనలు, నాటకాలతో బిజీగా గడిపారు. ఆయన భార్య విజయలక్ష్మి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మాడా వెంకటేశ్వరరావు గారు 2015లో తన 65వ ఏట వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. మాడా వెంకటేశ్వరరావు గారు తెలుగు చలనచిత్ర రంగానికి అందించిన సేవలు, ఆయన విలక్షణమైన నటన చిరస్మరణీయం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇండస్ట్రీలో తిరుగులేని విలన్.. కట్ చేస్తే చివరి రోజుల్లో డబ్బులు లేక జాతకాలు చెప్పుకుంటూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us