AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ క్రికెటర్‌తో శ్రీలీల ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి.? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ కొన్ని నెలలుగా శ్రీలీల నటించిన సినిమాలు హిట్టు కావడం లేదు.

స్టార్ క్రికెటర్‌తో శ్రీలీల ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి.? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి
Sreeleela
Rajeev Rayala
|

Updated on: May 18, 2026 | 12:11 PM

Share

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో మొదటి వరసలో ఉంటూనే ముద్దుగుమ్మ శ్రీలీల. తొలి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించింది ఈ అందాల తార.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల.. పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ  శ్రీలీల క్యూట్ పర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. ఆవెంటనే మాస్ రాజా రవితేజ ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుస సినిమాలతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుందని.. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు కొట్టేసింది. బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది శ్రీలీల.

ఇది కూడా చదవండి :చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా

ఇదిలా ఉంటే ఈ అమ్మడికి హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ.. చేసిన సినిమాల్లో ధమాకా, భగవంత్ కేసరి సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు ఏవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే కూడా ఈ చిన్నదాని ఆఫర్స్ తగ్గడం లేదు.. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంటుంది. అక్కడ శివకార్తికేయన్ తో కలిసి మదరాసి అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల ఓ స్టార్ క్రికెటర్ తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

టీమిండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్ లో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. తెలుగువాడైన తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్‌లో ఉంది, త్వరలోనే పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పెద్దెతున్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ టీ20 మ్యాచ్‌కి శ్రీలీల హాజరైంది. ముంబై మ్యాచ్ జరుగుతున్న సమయంలో శ్రీలీల స్టేడియంలో కనిపించింది. అలాగే ముంబై ఇండియన్స్ టీమ్ ను ఫ్యామిలీతో కలిసింది. దాంతో శ్రీలీల తిలక్ వర్మ రిలేషన్‌లో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని శ్రీలీల తల్లి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం వదంతులే, వాటిలో నిజం లేదు, శ్రీలీల, తిలక్ ఇంతవరకూ ఒకొక్కసారి కూడా కలుసుకోలేదు అని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత క్లారిటీ ఇచ్చారు.

Sreeleela Pic

ఇది కూడా చదవండి :అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది

View this post on Instagram

A post shared by SREELEELA (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us