ఎన్టీఆర్‌తో 17 సినిమాలు, ఎంజీఆర్‌తో 26 సినిమాలు.. తొలి పాన్ ఇండియా హీరోయిన్ ఈవిడే
సినిమా ఇండస్ట్రీలోనే ఆమె ఓ తోప్ హీరోయిన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె. స్టార్ హీరోలతో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు ఆమె. ఎన్టీఆర్ తో ఏకంగా 17 సినిమాలు, తమిళ్ హీరో ఎంజీఆర్ తో ఏకంగా 22 సినిమాల్లో నటించింది ఈ హీరోయిన్

భారతీయ సినీ చరిత్రలో ఒక అగ్రతారగా వెలుగొందారు బి.సరోజాదేవి. ఆమె అందం, అభినయం, నాట్యం, వ్యక్తిత్వం, సంస్కారం కలగలిసి తొలి పాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. 1955 నుంచి 1984 మధ్య కాలంలో, తన 17వ ఏట నుంచి 46 ఏళ్ల వయస్సు వరకు, ఆమె కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కలిపి 161 చిత్రాలకు పైగా కథానాయికగా నటించారు. మొత్తంగా ఆమె దాదాపు 200 సినిమాల్లో భాగమయ్యారు. కన్నడ సినిమా రంగంలో ఆమె “ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్”గా ఘనత సాధించారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 2008లో భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును, 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ నేషనల్ అవార్డును కూడా దక్కించుకున్నారు. 1965లో అభినయ సరస్వతి బిరుదును పొంది, 2006లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా
ఆమె పేరు మీద 2010లో భారతీయ విద్యాభవన్ పద్మభూషణ్ బి.సరోజాదేవి నేషనల్ అవార్డ్ను నెలకొల్పింది. బి.సరోజాదేవి 1938 జనవరి 7న కర్ణాటక రాజధాని బెంగళూరులో భైరప్ప, రుద్రమ్మ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించారు. ఆమె తండ్రి భైరప్ప మైసూర్ లో పోలీస్ అధికారి కాగా, తల్లి రుద్రమ్మ గృహిణి. సరోజాదేవి తండ్రి నాటకాలంటే ఎంతో ఆసక్తి ఉన్నవారు. నాట్య ప్రతిభను చిన్న వయస్సు నుంచే గుర్తించి, ఆమెకు శిక్షణ ఇప్పించి, సినీ రంగ ప్రవేశానికి తోడ్పాటు అందించారు. 1955లో 17 ఏళ్ల వయస్సులో విడుదలైన కన్నడ చిత్రం మహాకవి కాళిదాస ఆమె తొలి సినిమా. ఈ చిత్రం ఘన విజయం సాధించి, కన్నడ చిత్రసీమలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ఆమెకు వరుస అవకాశాలు రావడంతో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ అయ్యారు.
ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది
సినిమా రంగంలోకి అడుగుపెట్టిన 12 ఏళ్లకే, 1967 మార్చి 1న, భారత్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ శ్రీహర్షను వివాహం చేసుకున్నారు. ఆమె భర్త శ్రీహర్ష 1986లో, కుమార్తె భువనేశ్వరి చిన్న వయస్సులోనే మరణించారు. భర్త మరణం తర్వాత దాదాపు సంవత్సరం పాటు సినిమా రంగం నుంచి విరామం తీసుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్ గారితో 18 సినిమాలు, ఏఎన్ఆర్, కృష్ణ, హరనాథ్, భానుచందర్ వంటి అగ్ర నటులతో నటించారు. ఎంజీఆర్ గారితో 26, శివాజీ గణేశన్ గారితో 22, జెమినీ గణేష్ గారితో 17 సినిమాలు చేసి తమిళంలో కూడా సూపర్ స్టార్‌గా ఎదిగారు. హిందీలో దిలీప్ కుమార్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్ వంటి అగ్ర హీరోలతో నటించారు. కన్నడలో రాజ్ కుమార్ తో ఆమెది సూపర్ హిట్ కాంబినేషన్. ఆమె నటించిన శ్రీ సీతారామ కళ్యాణంలో మండొదరిగా, దానవీరశూరకర్ణలో వృషాలిగా, శ్రీరామాంజనేయ యుద్ధంలో సీతగా ఆమె పాత్రలు తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయం. 1960వ దశకంలో దక్షిణ భారత మహిళలకు ఆమె ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచారు. వయసురీత్యా ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన బి.సరోజాదేవి 2025 జూలై బెంగళూరులోని యశ్వంత్‌పుర మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.




