AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా

కొంతమంది హీరోయిన్స్ ప్రేక్షకులను తమ అందంతో నటనతో కట్టిపడేస్తుంటారు. వారిలో ఈ అందాల భామ ఒకరు. ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 17 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించింది.

తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: May 26, 2026 | 12:39 PM

Share

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన నటి మాధవి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో  సినిమాల్లో నటించి మెప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు తాలూకా, వేలుపుచెర్ల గ్రామంలో గోవిందస్వామి, శశిరేఖ దంపతులకు 1962లో కనకవిజయలక్ష్మిగా జన్మించారు మాధవి, ఆతర్వాత కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మాధవికి చిన్నతనం నుంచే కళలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఆమె భరతనాట్యం నేర్చుకుంటూనే, హార్స్ రైడింగ్ అభ్యసించి, కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. సినిమాల్లోకి రావాలనే ఉద్దేశ్యం ఆమెకు మొదట్లో లేదట.. అయితే రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇస్తుండగా, దర్శకుడు దాసరి నారాయణరావు ఆమెను గుర్తించి సినిమాల్లోకి ఆహ్వానించారు. తొలుత తన తల్లిదండ్రులను సంప్రదించి, ఒకే సినిమా తర్వాత నటించననే షరతుతో “తూర్పు పడమర” చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారట. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు ఆమె అసలు పేరు కనకవిజయలక్ష్మిని “మాధవి”గా మార్చారు.

ఇది కూడా చదవండి : వారెవ్వా.. ఏముంది మావ సాంగ్.! వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఊపేస్తోంది

“తూర్పు పడమర” తమిళ్ లో రీమేక్ అయిన తర్వాత, దర్శకుడు కె. బాలచందర్ ఆమెను తన “మరో చరిత్ర” చిత్రంలో కమలహాసన్ సరసన ఎంపిక చేశారట. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బాలచందర్ తీసిన “త్రిల్లు ముల్లు” (రజనీకాంత్‌తో) చిత్రంలోనూ నటించారు. పెద్దలు, దర్శకుల ప్రోత్సాహంతో, కళాకారిణిగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మాధవి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. మాధవి నటిగా తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. కన్నడలో రాజ్ కుమార్ తో ఏడు చిత్రాల్లో, విష్ణువర్ధన్, అనంతనాగ్ వంటి నటులతోనూ నటించారు. మలయాళంలో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి అగ్రతారలతో కలిసి పనిచేశారు.  తెలుగులో చిరంజీవి నటించిన “ఖైదీ” చిత్రంలో ఆమె “రగులుతోంది మొగలిపొద” పాటతో ఎనలేని గుర్తింపు పొందారు. “మాతృ దేవో భవ” చిత్రంలో ఆమె నటన నంది, జాతీయ అవార్డులను గెలుచుకుంది.

ఇది కూడా చదవండి :ఫా…! ఏం గుండె రా వాడిది.!! భర్త పక్కన ఉండగానే సమంతకు ఐ లవ్ యు చెప్పిన వ్యక్తి..

తన కెరీర్ పీక్ లో  ఉన్నప్పుడే, మాధవి వ్యక్తిగత జీవితానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ మాధవికి ఓ ఆధ్యాతిక పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చారట. అది చదివిన తర్వాత ఆమె బాబాజీలను నమ్మడం మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే ఆమె ఓ స్వామీజీని కలిసినప్పుడు.. ఆ స్వామిజీ నా శిష్యుడు అమెరికా నుంచి వస్తాడు. అని చెప్పి అతన్ని పిలిపించి. మాధవిని కలిపించారట.. ఆతర్వాత ఆ స్వామిజీ.. మీ ఇద్దరూ కలిసి వివాహం చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పాడట. ఆయన చెప్పడంతో నమ్మకంతో కెరీర్ పీక్ లో ఉండగానే.. ఇండస్ట్రీకి వచ్చిన 17ఏళ్లకే రాల్ఫ్ శర్మ పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత సినిమా రంగం నుండి పూర్తిగా తప్పుకొని, హౌస్ వైఫ్‌గా ఉంటూ తన కుటుంబానికి న్యాయం చేయాలని మాధవి నిర్ణయించుకున్నారు. మాధవి ప్రస్తుతం ముగ్గురు ఆడపిల్లలతో, భర్తతో కలిసి ప్రస్తుతం న్యూజెర్సీలో స్థిరపడి ఆనందంగా జీవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Nagarjuna: ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్వారు.. ఆతర్వాత మళ్లీ దాని జోలికి వెళ్ళలేదు..

Madhavi

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us