సిల్క్ స్మితా నన్ను కాలితో తన్నింది.. సెట్‌లోనే ఏడ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఒకప్పుడు కుర్రకారును ఊపు ఊపేసిన నటీమణుల్లో సిల్క్ స్మిత ఒకరు. స్పెషల్ సాంగ్ కు సిల్క్ స్మిత పెట్టింది పేరు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. తమిళ్ ఇండస్ట్రీలో వండి చక్రం అనే సినిమాద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. స్టార్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి మెప్పించిన నటి ఆమె.. బోల్డ్ పాత్రలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆమె.. ఆ అందాల తార మరెవరో కాదు బోల్డ్ పాత్రలతో మెప్పించారు షకీలా.. షకీలా గతంలో ఓ ఇటీవలలో దివంగత నటి సిల్క్ స్మితాతో తనకున్న అనుబంధం, ఆనాటి సినీ అనుభవాలను పంచుకున్నారు. సిల్క్ స్మితా తనను చెంపదెబ్బ కొట్టినట్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్న వార్త నిజమేనని షకీలా తెలిపారు. అయితే, డర్టీ పిక్చర్ వంటి చిత్రాలలో చూపించినట్లు తాను ఎప్పుడూ సిల్క్ స్మితాకు ప్రత్యర్థిని కాదని షకీలా స్పష్టం చేశారు. షకీలా సినీ రంగ ప్రవేశం చేసిన మొదటి సినిమాలోనే సిల్క్ స్మితా హీరోయిన్‌గా, తాను సిస్టర్ క్యారెక్టర్‌లో నటించానని తెలిపారు. సిల్క్ స్మితా 1998లో మరణించిన తర్వాత, 1999 చివరినాటికి మలయాళ చిత్ర పరిశ్రమలో తనకు స్టార్‌డమ్ వచ్చిందని వివరించారు.
ఇది కూడా చదవండి : వారెవ్వా.. ఏముంది మావ సాంగ్.! వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఊపేస్తోంది
సిల్క్ స్మితా బతికి ఉండుంటే ఈ రోజు తనకు ఈ పేరు కూడా వచ్చి ఉండేది కాదోమో అని షకీలా అనుమానం వ్యక్తం చేశారు. ఆమె నెంబర్ వన్ స్టార్ అని, చాలా అందమైన మహిళ అని కొనియాడారు. సిల్క్ స్మితా స్వభావం గురించి మాట్లాడుతూ, ఆమె గర్వంగా ఉండేదని తాను చెప్పనని అన్నారు. ఆమె మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేవని, వ్యక్తిగత సమస్యల వల్ల అందరితో బాగా మాట్లాడేవారు కాదని షకీలా చెప్పారు. అయితే, అప్పుడప్పుడు తనకు చాక్లెట్లు తెచ్చి ఇచ్చేవారని, అలాగే ఒకసారి షూటింగ్ సమయంలో బ్రా ప్యాడింగ్ గురించి సలహా ఇచ్చి సహాయపడ్డారని గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి :ఫా…! ఏం గుండె రా వాడిది.!! భర్త పక్కన ఉండగానే సమంతకు ఐ లవ్ యు చెప్పిన వ్యక్తి..
చెంపదెబ్బ సంఘటన గురించి వివరిస్తూ, ఒక షాట్‌లో సిల్క్ స్మితా తనను తన్నాల్సి వచ్చిందని, ఆమె నిజంగానే గట్టిగా తన్నారని షకీలా చెప్పారు. అది జరిగినప్పుడు డైరెక్టర్ ముందు నిజంగానే ఏడుపొచ్చిందని, చాలా బాధపడ్డానని తెలిపారు. షాట్ అయిపోయిన తర్వాత సిల్క్ స్మితా తనను కౌగిలించుకుందని, ఆ తర్వాత వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడిందని షకీలా పేర్కొన్నారు. సిల్క్ స్మితా చాలా సున్నితమైన స్వరంతో, “నువ్వు టవల్‌లో ఉన్నావు, ఇది నీకు ప్రాక్టీస్ లేదు కదా కొట్టడం అనేది. అందుకే ఒక్క షాట్‌లో అయిపోవాలని చేశాను. అందరూ నిన్ను చూస్తున్నారు అందుకే కాస్త గట్టిన తన్నాను” అని వివరణ ఇచ్చిందని తెలిపారు. అయితే, ఆ సమాధానం తన మనసులో ఇప్పటికీ అరగలేదని, తను ఇప్పటికీ సంతృప్తి చెందలేదని షకీలా వెల్లడించారు. ఈ సంఘటనే “సిల్క్ స్మితా షకీలాను కొట్టింది” అని ప్రచారంలో ఉన్న వార్తకు మూలమని ఆమె చెప్పుకొచ్చారు.
