AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drishyam 3 OTT: ‘దృశ్యం 3’ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్.. స్ట్రీమింగ్‌కు ఎప్పుడు రానుందంటే?

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా దృశ్యం 3. గతంలో రిలీజై సంచలన విజయం సాధించిన దృశ్యం సిరీస్ లో ఇది మూడో భాగం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ. 200 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది.

Drishyam 3 OTT: 'దృశ్యం 3' ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్.. స్ట్రీమింగ్‌కు ఎప్పుడు రానుందంటే?
Drishyam 3 Movie
Basha Shek
|

Updated on: May 27, 2026 | 10:59 AM

Share

మలయాళం నుంచి వచ్చిన విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్లలో ‘దృశ్యం’ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఏ భాషలో తీసినా ఈ సినిమాలు సంచలన విజయాలు సాధిస్తున్నారు. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలను తెలుగులో విక్టరీ వెంకటేష్ తో రీమేక్ చేస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడీ సక్సెస్ ఫుల్ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ నుంచి ‘దృశ్యం 3’ వచ్చింది. అయితే ఈసారి మోహన్‌లాల్‌ నటించిన సినిమానే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రెండు పార్టులతో పోల్చుకుంటే పెద్దగా ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేనప్పటికీ మౌత్ టాక్ తో మంచి గానే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ ఆరు రోజుల్లో దృశ్యం సినిమాకు సుమారు రూ. 170 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి రికార్డుల్ని నమోదు చేస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు దృశ్యం 3 మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతుందా..? అని మూవీ లవర్స్ తెగ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం దృశ్యం 3 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ దిగ్గజ సంస్థలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు పోటీ పడుతున్నాయని సమాచారం. ఈ రెండు సంస్థలలో ఒకటి భారీ ధరకు డీల్ ముగించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఎలాంటి సినిమానే అయినా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాతనే ఓటీటీలోకి వస్తున్నా. ఈ లెక్కన చూసుకుంటే దృశ్యం 3 మూవీ కూడా జూన్ మూడో వారం లేదా ఆఖరి వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆశీర్వాద్‌ సినిమాస్‌, పనోరామా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన దృశ్యం సినిమాలో మోహన్ లాల్ సరసన మీనా కథానాయికగా నటించింది. అన్సీబా హాసన్, ఎస్తర్‌ అనిల్, సిద్ధిఖీ, బిజూ మేనన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్‌ జాన్సన్‌ సంగీతం సమకూర్చారు.

రికార్డు స్థాయిలో బుక్ మై షో టికెట్స్ బుకింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us