AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: గురు బలం..ఇక వారి అప్పులు, ఆర్థిక సమస్యలు ఫసక్..!

Guru Gochar 2026: జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించనుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు అక్టోబర్ 31 లోగా అప్పుల భారంనుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురు అనుగ్రహంతో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 27, 2026 | 12:59 PM

Share
శని అప్పులు చేయిస్తాడని, గురువు అప్పులు తీరుస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో గురు బలం తోడయినవారికి అప్పులు, ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు. జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందు వల్ల అక్టోబర్ 31 లోగా కొన్ని రాశులవారు అప్పుల ఊబిలోంచి సురక్షితంగా బయటపడడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి కారకుడైన గురువు అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మేషం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ విషయంలో మంచి రోజులు రాబోతున్నాయి.

1 / 7
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశివారికి జూన్ తర్వాత ఎక్కువగా రుణ సమస్యలు ఉండే అవకాశం లేదు. ఆదాయం వృద్ధి చెంది వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వీరు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సంపాదనకు సంబంధించిన ఏ అవకాశాన్నీ చేజార్చుకునే అవకాశం ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా లాభాలు గడించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా విముక్తి లభించవచ్చు.

2 / 7
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛస్థితికి వస్తున్నందు వల్ల ఈ రాశివారు ఒకటి రెండు నెలల్లో సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఇక వీరు రుణాలు ఇవ్వడమే తప్ప రుణం తీసుకునే అవసరం ఉండకపోవచ్చు. జూన్ నుంచి వీరికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. రుణాల నుంచి పూర్తిగా బయటపడడమే కాక, ముఖ్య మైన ఆర్థిక అవసరాలన్నీ తీరిపోతాయి. జీతభత్యాలు, రాబడి కూడా బాగా వృద్ధి చెందుతాయి.

3 / 7
కన్య: లాభ స్థానంలో ఉచ్ఛపడుతున్న గురువు వల్ల ఈ రాశివారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. దీర్ఘకాలిక రుణాలతో సహా రుణ, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం కావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. అక్టోబర్ 31లోగా వీరు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. జూన్ నుంచి వీరి రుణ భారం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.

4 / 7
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందున అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చి ఈ రాశివారు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలు కూడా బాగా తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు, అవసరాలు మటుమాయం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఫలితంగా ఈ ఏడాది ఆర్థిక సమస్యలు, రుణ భారాలు ఉండకపోవచ్చు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు.

5 / 7
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ప్రవేశించిన తర్వాత నుంచి ఈ రాశివారి రుణ సమస్యలు, ఒత్తిళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వీరికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా లాభించే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆస్తి, ఆదాయం కలిసి వస్తాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఇతరులకు రుణాలిచ్చే పరిస్థితి కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం జరుగుతుంది.

6 / 7
మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు మాత్రమే కాదు, ఇతరత్రా అనేక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఏడాది పాటు వీరి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం పెరిగి, రుణ సమస్యల నుంచి బయటపడడమే కాక, ఆర్థిక అవసరాలు కూడా తీరిపోతాయి. మనసు లోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఏదో ఒక రూపేణా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది.

7 / 7
Follow Us