TDP Mahanadu 2026: పసుపు పండగ.. టీడీపీ మహానాడు ప్రత్యక్ష ప్రసారం..
టీడీపీ మహానాడు 2026 మంగళగిరిలో ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్లతో మహానాడు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. రెండు రోజుల మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీడీపీ.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహానాడు ప్రారంభమైంది.. ఉదయం 10:10కి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉపన్యాసంతో మహానాడు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అయితే, మహానాడుకి ముందుగా మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో ప్రధాన వేదిక దగ్గర పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు… ఇక, రెండు రోజులపాటు హైబ్రిడ్ విధానంలో మహానాడు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ ప్రధాన వేదికతో క్లస్టర్ల అనుసంధానం చేశారు. ఈ క్లస్టర్ల ద్వారా కేంద్ర నాయకత్వంతో నేరుగా మాట్లాడనున్నారు కార్యకర్తలు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కార్యవర్గాల సభ్యులు పాల్గొంటారు. ఇక, 2 రోజుల మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 10 ఏపీ తీర్మానాలు, 4 తెలంగాణ తీర్మానాలు, ఒక అండమాన్ తీర్మానం.. నాలుగు ఉమ్మడి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించనున్న టీడీపీ. ఇక, చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెడతారు.
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

