AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్లలో లాభాలట!

Business Success Astrology: సొంత వ్యాపారంలో విజయం సాధించాలని చాలామంది కోరుకుంటారు. అయితే అందరికీ ఒకేలా ఫలితాలు రావు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి రాశి, గ్రహ ప్రభావం వ్యాపార విజయంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిత్వానికి సరిపోయే రంగంలో వ్యాపారం చేస్తే మంచి అభివృద్ధి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

Rajashekher G
|

Updated on: May 27, 2026 | 12:06 PM

Share
Business Success Astrology: సొంతంగా వ్యాపారం ప్రారంభించి విజయవంతం కావాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే ఒకే విధంగా కష్టపడినా కొందరికి మంచి లాభాలు వస్తే, మరికొందరు ఆశించిన ఫలితాలు పొందలేకపోతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి పుట్టిన రాశి, ఆ రాశికి అధిపతి అయిన గ్రహ స్వభావం కూడా వ్యాపార విజయంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిత్వానికి, ఆలోచనా విధానానికి సరిపోయే రంగంలో వ్యాపారం ప్రారంభిస్తే అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

1 / 6

మేషం, సింహం, ధనుస్సు రాశులు..
 
అగ్ని తత్వానికి చెందిన మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం,          హోటల్, రెస్టారెంట్ వ్యాపారాలు, అలాగే ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఆలోచనలను అమలు చేయడంలో వీరు ముందుంటారని భావిస్తారు.

మేషం, సింహం, ధనుస్సు రాశులు.. అగ్ని తత్వానికి చెందిన మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హోటల్, రెస్టారెంట్ వ్యాపారాలు, అలాగే ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఆలోచనలను అమలు చేయడంలో వీరు ముందుంటారని భావిస్తారు.

2 / 6

వృషభం, కన్య, మకర రాశులు..

భూ తత్వ రాశులైన వృషభం, కన్య, మకర రాశుల వారు స్థిరమైన ఆలోచనలతో వ్యవహరిస్తారు. దీర్ఘకాల ప్రణాళికలు, ఆర్థిక నియంత్రణ వీరి బలంగా భావిస్తారు. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు, ఫైనాన్స్, బంగారం-వెండి వ్యాపారాలు, కిరాణా, హోల్‌సేల్ రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి.

వృషభం, కన్య, మకర రాశులు.. భూ తత్వ రాశులైన వృషభం, కన్య, మకర రాశుల వారు స్థిరమైన ఆలోచనలతో వ్యవహరిస్తారు. దీర్ఘకాల ప్రణాళికలు, ఆర్థిక నియంత్రణ వీరి బలంగా భావిస్తారు. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు, ఫైనాన్స్, బంగారం-వెండి వ్యాపారాలు, కిరాణా, హోల్‌సేల్ రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి.

3 / 6

మిథునం, తుల, కుంభ రాశులు..

వాయు తత్వానికి చెందిన మిథునం, తుల, కుంభ రాశుల వారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత ఎక్కువగా ఉంటాయి. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, మీడియా, కన్సల్టెన్సీ, ట్రావెల్ సర్వీసులు, ఫ్యాషన్ లేదా బట్టల వ్యాపారాల్లో వీరు వేగంగా ఎదగగలరని చెబుతున్నారు. వినియోగదారులతో సులభంగా కలిసిపోవడం వీరి ప్రత్యేకతగా భావిస్తారు.

మిథునం, తుల, కుంభ రాశులు.. వాయు తత్వానికి చెందిన మిథునం, తుల, కుంభ రాశుల వారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత ఎక్కువగా ఉంటాయి. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, మీడియా, కన్సల్టెన్సీ, ట్రావెల్ సర్వీసులు, ఫ్యాషన్ లేదా బట్టల వ్యాపారాల్లో వీరు వేగంగా ఎదగగలరని చెబుతున్నారు. వినియోగదారులతో సులభంగా కలిసిపోవడం వీరి ప్రత్యేకతగా భావిస్తారు.

4 / 6

కర్కాటకం, వృశ్చికం, మీన రాశులు..

జల తత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు భావోద్వేగపరులు, వినూత్న ఆలోచనలు కలిగినవారిగా గుర్తించబడతారు. మినరల్ వాటర్, డైరీ, ఫార్మసీ, రసాయనాలు, ఎగుమతి-దిగుమతి, ఆర్ట్,   డిజైనింగ్ రంగాల్లో వీరు మెరుగైన అవకాశాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల కంటే స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు ఎక్కువగా రాణించే అవకాశం ఉందని అంటున్నారు.

కర్కాటకం, వృశ్చికం, మీన రాశులు.. జల తత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు భావోద్వేగపరులు, వినూత్న ఆలోచనలు కలిగినవారిగా గుర్తించబడతారు. మినరల్ వాటర్, డైరీ, ఫార్మసీ, రసాయనాలు, ఎగుమతి-దిగుమతి, ఆర్ట్, డిజైనింగ్ రంగాల్లో వీరు మెరుగైన అవకాశాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల కంటే స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు ఎక్కువగా రాణించే అవకాశం ఉందని అంటున్నారు.

5 / 6
అయితే వ్యాపార విజయానికి కేవలం రాశి మాత్రమే కారణం కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. జాతకంలో బుధ గ్రహ స్థితి, లాభ స్థాన బలం, అలాగే వ్యక్తిగత శ్రమ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. సరైన ప్రణాళికతో పాటు కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయాన్ని అందుకోవచ్చని పేర్కొంటున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

అయితే వ్యాపార విజయానికి కేవలం రాశి మాత్రమే కారణం కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. జాతకంలో బుధ గ్రహ స్థితి, లాభ స్థాన బలం, అలాగే వ్యక్తిగత శ్రమ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. సరైన ప్రణాళికతో పాటు కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయాన్ని అందుకోవచ్చని పేర్కొంటున్నారు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

6 / 6
Follow Us
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!
కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!