AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: జబర్దస్త్‌లో అతను చాలా కమర్షియల్.. భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Jabardasth: జబర్దస్త్‌లో అతను చాలా కమర్షియల్.. భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..
Bullet Bhaskar
Rajeev Rayala
|

Updated on: May 27, 2026 | 12:21 PM

Share

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఒకరు. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించాడు బుల్లెట్ భాస్కర్. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోతోనూ నవ్వులు పూయిస్తున్నాడు భాస్కర్. కాగా ఇటీవల ఓ  ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఆయన జబర్దస్త్ రంగప్రవేశం, తోటి నటులతో అనుబంధాలు, సోషల్ మీడియా పట్ల తన అభిప్రాయాలను వివరించారు. భాస్కర్ తన కెరీర్ ప్రారంభం గురించి మాట్లాడుతూ, వైజాగ్‌లో ఆర్జేగా అనుకోకుండా తన ప్రయాణం మొదలైందని తెలిపారు. ఆర్టిస్ట్ అవ్వాలనే ప్రత్యేక ఆసక్తి లేకపోయినా, కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా రంగంలోకి ప్రవేశించానని అన్నారు. జబర్దస్త్ షోలోకి వచ్చిన తర్వాత, లేడీ గెటప్‌లు వేయాల్సి రావడం వల్ల గడ్డం పెంచడానికి అవకాశం ఉండేది కాదని.. ఇప్పుడు అదే అలవాటయ్యింది పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి : సిల్క్ స్మితా నన్ను కాలితో తన్నింది.. సెట్‌లోనే ఏడ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన నటి

జబర్దస్త్ వేదికపై నరేష్, ఫైమా, సునామి సుధాకర్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన ఆర్టిస్ట్ లను పరిచయం చేయడంలో తాను కీలక పాత్ర పోషించానని బుల్లెట్ భాస్కర్ తెలిపాడు. అయితే, ఆ ఆర్టిస్ట్ ల్లో సహజసిద్ధమైన ప్రతిభ ఉందని, తాను కేవలం వారికి సరైన మార్గదర్శకత్వం మాత్రమే అందించానని చెప్పుకొచ్చాడు. “నేను మంచి పర్ఫార్మర్‌ను కాదు, లిమిటెడ్ ఆర్టిస్టును” అని ఆయన పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వ్యక్తులు కొద్దికాలమే వెలుగులో ఉంటారని, అయినప్పటికీ, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కోరిక మేరకు కొందరిని తన స్కిట్‌లలో తీసుకువచ్చానని, కానీ వారు ఒక ఎపిసోడ్ తర్వాత కనపడకుండా పోయేవారని గుర్తుచేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి:Roja : స్టార్ హీరోల్లో ఆయన నాకు చాలా క్లోజ్.. భలే సరదా మనిషి .. చాలా మంచివారు

నరేష్ గురించి మాట్లాడుతూ, అతను చాలా కమర్షియల్ వ్యక్తి అని, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తాడని స్పష్టం చేశాడు. ఉదాహరణకు మా  సొంత తాతయ్య చనిపోయారు రా రా అని పిలిస్తే.. పెట్రోల్ డబ్బులు అడుగుతాడని సరదాగా చెప్పుకొచ్చాడు. మా ఇంట్లో భోజనానికి రారా అని పిలిచినా పెట్రోల్ కు డబ్బులు కొట్టు అని అడుగుతాడు అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. నరేష్ జాగ్రత్తపరుడు అని, అతని నుంచి చాలా నేర్చుకోవాలని అన్నాడు భాస్కర్. జబర్దస్త్ షో క్వాలిటీ తగ్గడానికి కొత్తవారిని తీసుకురావడం కారణమనే వాదనను భాస్కర్ ఖండించాడు. టీమ్ లీడరే స్కిట్ విజయం లేదా అపజయం పట్ల పూర్తి బాధ్యత వహించాలని, ఇతరులపై నిందలు వేయడం సరికాదని ఆయన తెలిపాడు. సోషల్ మీడియాలోకి రావడం అనేది “బట్టలిప్పి రోడ్డు మీదకు రావడం” లాంటిదని, ఇది ప్రతి ఒక్కరికీ మన గురించి మాట్లాడే అవకాశం ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. నెగిటివ్ కామెంట్స్, విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉండటానికే తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని తెలిపాడు.

ఇది కూడా చదవండి:తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా

నరేష్ ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us