AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: 2030 నాటికి చంద్రుడిపై సొంత ఇల్లు.. మానవులు అక్కడికి వెళ్లిపోవచ్చు.. భారీ ప్లాన్‌ రెడీ..

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ ప్లాన్ వేస్తోంది. చంద్రుడిపై వాతావరణం మానవులు నివసించే విధంగా ఉంటుందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది. దీంతో చంద్రుడిపై మానవులను తీసుకెళ్లేందుకు ఇప్పటికే అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాసా మానవ నివాసం ఏర్పాటు చేసే మిషన్ చేపడుతోంది.

NASA: 2030 నాటికి చంద్రుడిపై సొంత ఇల్లు.. మానవులు అక్కడికి వెళ్లిపోవచ్చు.. భారీ ప్లాన్‌ రెడీ..
Nasa
Venkatrao Lella
|

Updated on: May 27, 2026 | 12:15 PM

Share

చంద్రుడిపై భూమి అమ్ముతామంటూ ఓ సినిమాలో ప్రజలను మోసం చేసిన సీన్ మీరు చూసే ఉంటారు. ఇది నిజమేనని నమ్మి చాలామంది డబ్బులు ఇచ్చి మోసపోతారు. సినిమాలో దీనిని మోసంగా చూపించినా.. రానున్న కొన్నేళ్లల్లో అదే నిజం కానుంది. భవిష్యత్తులో చంద్రుడిపై మానవులు నివసించేలా చేయడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. నాసా ఇప్పటికే అనేక ప్రయోగాలు చేయగా.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ పేరుతో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులు సక్సెస్ కాగా.. చంద్రుడిపై వాతావరణం, అక్కడి పరిస్థితులపై అనేక సమాచారం సేకరించాయి. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఈ సమాచారం శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడనుంది.

ఇస్రో మరో ముందడుగు

అయితే నాసా మరో ముందడుగు వేసింది. చంద్రుడిపై శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2030 నాటికి దక్షిణ ధృవంపై మానవులు నివసించేందుకు వీలుగా నివాసం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 2030 నాటికి చంద్రుడిపైకి మానవులను పంపించాలని చైనా ప్లాన్ చేస్తున్న క్రమంలో.. అమెరికా ఏకంగా శాశ్వత స్ధావరం నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం రోబోటిక్ ల్యాండర్లు, డ్రోన్లును ఉపయోగించుకోనుంది. ఈ పరికరాలు చంద్రుడిపై మానవ నివాసం ఏర్పాటు చేయడంలో ఉపయోగడతాయి. ఈ ప్రాజెక్ట్ కోసం పలు ప్రైవేట్ కంపెనీలతో అమెరికా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ట్రంప్ పదవీకాలం ముగిసే 2029లోపు చంద్రుడిపైకి మానవులను పంపి చరిత్ర సృష్టించాలని నాసా సన్నద్దమవుతోంది.

చైనాతో అమెరికా పోటీ

ఈ మిషన్ కోసం అమెరికా బ్లూ ఆరిజిన్, ఇంట్యూటివ్ మెషీన్స్, మరియు ఆస్ట్రోబోటిక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఆధ్వర్యంలోని బ్లూ ఆరిజిన్, ఎండ్యూరెన్స్ కంపెనీలు ప్రత్యేక లూనార్ ల్యాండర్‌ను నిర్మించనుంది. చంద్రుని దక్షిణ ధృవంపై శాశ్వత అణు, సౌరశక్తితో నడిచే స్థావరాన్ని నిర్మించేందుకు 2026 మార్చిలో నాసా 20 మిలియన్ డాలర్లతో ఓ ప్రణాళికలను ప్రకటించింది. చైనా 2030 నాటికి మనుషులను చంద్రుడిపైకి పంపాలని చూస్తోండగా.. అమెరికా కూడా పోటీ పడుతోంది. ఇటీవల చైనా షెన్‌జౌ-23 మిషన్‌ను ద్వారా టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపిన విషయం తెలిసిందే.

మూడు విడతలుగా మిషన్

నాసా మూడు విడతలుగా మిషన్ చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో రోబోటిక్ ల్యాండర్లు, డ్రోన్లను పంపనుంది. ఇవి చంద్రుని ఉపరితలాన్ని మ్యాప్ చేసి భూభాగాన్ని అన్వేషిస్తాయి. ఇక ఆ తర్వాత భవిష్యత్తులో వ్యోమగాములకు చంద్రునిపై అన్వేషణకు, సరుకు రవాణాకు సహాయపడేందుకు వాహనాలను పంపనున్నారు. ఆస్ట్రోబోటిక్ గ్రిఫిన్-1 ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో నోబైల్ క్రేటర్‌లో దిగుతుంది. 2029 నాటికి 25 ప్రయోగాలు నిర్వహించి, సుమారు 4 మెట్రిక్ టన్నుల సరుకును చంద్రుడిపైకి చేర్చాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అక్కడ అణు రియాక్టర్లు, సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. 2032 నాటికి పాక్షిక శాశ్వత మానవ నివాసాలను నిర్మించనున్నారు.

Follow Us
2030 నాటికి చంద్రుడిపైకి మానవులు.. అక్కడే శాశ్వత నివాసం..
2030 నాటికి చంద్రుడిపైకి మానవులు.. అక్కడే శాశ్వత నివాసం..
మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్ల
మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్ల
ఎంత ముదురు మటన్ అయినా ఇది వేస్తే మెత్తగా ఉడకాల్సిందే..
ఎంత ముదురు మటన్ అయినా ఇది వేస్తే మెత్తగా ఉడకాల్సిందే..
త్రిష ఆ పని చేస్తే సినిమా సూపర్ హిట్టే.. 'కరుప్పు'లోనూ జరిగిందిదే
త్రిష ఆ పని చేస్తే సినిమా సూపర్ హిట్టే.. 'కరుప్పు'లోనూ జరిగిందిదే
ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది..
ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది..
'నిజమే.. జవాబు పత్రాలు మారాయ్‌..' ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న CBSE
'నిజమే.. జవాబు పత్రాలు మారాయ్‌..' ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న CBSE
గుజరాత్ ఫోటోషూట్‌లో కింగ్ రచ్చ.. కోహ్లీ ర్యాగింగ్ మామూలుగా లేదుగా
గుజరాత్ ఫోటోషూట్‌లో కింగ్ రచ్చ.. కోహ్లీ ర్యాగింగ్ మామూలుగా లేదుగా
ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేస్తున్నారా..?
ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేస్తున్నారా..?
బక్రీద్‌కు బెస్ట్ స్వీట్ ఇదే.. బ్రెడ్‌తో చేసే డబుల్ కా మీఠా
బక్రీద్‌కు బెస్ట్ స్వీట్ ఇదే.. బ్రెడ్‌తో చేసే డబుల్ కా మీఠా
ఫంక్షన్ హాల్‌కు వచ్చిన ఊహించని అతిధి.. దెబ్బకు జనాలు పరార్
ఫంక్షన్ హాల్‌కు వచ్చిన ఊహించని అతిధి.. దెబ్బకు జనాలు పరార్