AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Buchibabu : పెద్ది సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు..

భారీ అంచనాల మధ్య విడుదలై మొదటి రోజు దిమ్మతిరిగే కలెక్షన్స్ రాబట్టింది పెద్ది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఇందులో కథానాయికగా నటించిన జాన్వీ కపూర్ పాత్ర పై కొన్ని విషయాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు అత్యంత హుందగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే ఈ సినిమా నుంచి పలు సీన్స్ తొలగిస్తున్నట్లు తెలిపారు.

Director Buchibabu : పెద్ది సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు..
Buchi Babu Sana
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2026 | 12:16 PM

Share

డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ పెద్ది. జూన్ 4న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అదిరిపోయిందని.. జగపతి బాబు, శివరాజ్ కుమార్ తమ పాత్రలలో ఒదిగిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఓవైపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ మరోవైపు హీరోయిన్ క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇందులో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర కేవలం గ్లామర్ షోకు మాత్రమే పరిమితమైందని కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై డైరెక్టర్ బుచ్చిబాబు సన హుందగా స్పందించారు.

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

“ఒక చిత్రనిర్మాతగా, సినిమా ప్రేక్షకులను అలరించాలి, ప్రేరేపించాలి, వారితో మమేకం కావాలని నేను నమ్ముతాను. అది ఎవరినీ అసౌకర్యానికి గురిచేయకూడదు లేదా అగౌరవపరచకూడదు. ‘పెద్ది’లోని కొన్ని సన్నివేశాల గురించి వచ్చిన అభిప్రాయాలను మేము విన్నాము. వాటిని తీవ్రంగా పరిగణించాము. తెరపైన, తెర వెనుక కూడా మహిళల పట్ల నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది, ఏ స్త్రీ పాత్రను వస్తువుగా చూపించడం లేదా అగౌరవపరచడం మా ఉద్దేశ్యం ఎప్పుడూ కాదు. సినిమాలోని ఏ భాగాన్నైనా ఆ విధంగా భావించి ఉంటే, మేము ఆ భావాలను గౌరవిస్తాము, వ్యక్తం అవుతున్న ఆందోళనలను అర్థం చేసుకుంటాము . మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాము. అభిప్రాయాలను సమీక్షించిన తర్వాత, సంబంధిత భాగాలలో మార్పులు చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ప్రేక్షకులతో ఏర్పడే అనుబంధం ద్వారానే సినిమా ఎదుగుతుంది, కథకులుగా, మారుతున్న దృక్కోణాలు , సున్నితత్వాల పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మనకు ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ప్రతి మహిళ గౌరవించబడటానికి, విలువ ఇవ్వబడటానికి , హుందాగా ప్రాతినిధ్యం వహించడానికి అర్హురాలు. బలమైన పాత్రలను కీర్తించే , ఆ విలువలను నిలబెట్టే కథలను చెప్పడానికి మేము కట్టుబడి ఉన్నాము. తమ అభిప్రాయాలను నిజాయితీగా , మనస్ఫూర్తిగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బుచ్చిబాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

అయితే పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ కొంతమంది అడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ పరిగణలోకి తీసుకుని వెంటనే చిత్రయూనిట్ సినిమాలో మార్పులు చేయడంపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క నెటిజన్ అభిప్రాయానికి డైరెక్టర్ బుచ్చిబాబు గౌవరం ఇచ్చి, సినిమాలో పలు సీన్స్ పై స్పందించడం.. మార్పులు చేయడంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.

బుచ్చిబాబు ట్వీట్.. 

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

Follow Us
జాన్వీ పాత్ర పై కామెంట్స్.. పెద్ది సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు
జాన్వీ పాత్ర పై కామెంట్స్.. పెద్ది సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు
ఇల్లు తుడిచే నీటిలో ఈ పదార్థాలను కలపండి! ఏసీలా చల్లగా, అద్దంలాంటి
ఇల్లు తుడిచే నీటిలో ఈ పదార్థాలను కలపండి! ఏసీలా చల్లగా, అద్దంలాంటి
ధోనీ సరసన రిషభ్ పంత్.. 'హాఫ్ సెంచరీ'తో అరుదైన మైలురాయి..!
ధోనీ సరసన రిషభ్ పంత్.. 'హాఫ్ సెంచరీ'తో అరుదైన మైలురాయి..!
తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!
తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!
రూ.2.15లక్షల డిస్కౌంట్.. కారు కొనాలనుకునే వారికి పండగే..
రూ.2.15లక్షల డిస్కౌంట్.. కారు కొనాలనుకునే వారికి పండగే..
నేను ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది.. కానీ..
నేను ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది.. కానీ..
కీలక స్పీచ్ ఇస్తోన్న లిటిల్ మాస్టర్.. ఇంతలో భార్య నుంచి ఫోన్..
కీలక స్పీచ్ ఇస్తోన్న లిటిల్ మాస్టర్.. ఇంతలో భార్య నుంచి ఫోన్..
గుడ్లను డజన్ లెక్కలోనే ఎందుకు అమ్ముతారు? ఆసక్తికరమైన చరిత్ర ఇదే!
గుడ్లను డజన్ లెక్కలోనే ఎందుకు అమ్ముతారు? ఆసక్తికరమైన చరిత్ర ఇదే!
24 రోజులు గడిచినా మిస్టరీగానే విద్యార్థిని మృతి కేసు..అతడిపైనే
24 రోజులు గడిచినా మిస్టరీగానే విద్యార్థిని మృతి కేసు..అతడిపైనే
Video: ఇలాంటి క్యాచ్‌ని ఇంతకుముందెప్పుడు చూసి ఉండరు..
Video: ఇలాంటి క్యాచ్‌ని ఇంతకుముందెప్పుడు చూసి ఉండరు..